ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (17:32 IST)

హను-మాన్ లో దైవశక్తి మమ్మల్ని నడిపి భారత్ లో హీరోగా నిలిపింది తేజ సజ్జా

Teja Sajja
Teja Sajja
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో హీరో తేజ సజ్జా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  
 
హను-మాన్ ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడం ఎలా అనిపిస్తోంది ?
-చాలా ఆనందంగా వుంది. అన్నిచోట్ల నుంచి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులంతా చాలా గొప్ప ఆదరిస్తున్నారు. బయట భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సర్ ప్రైజింగా వుంది. నేను ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం వుంది. కానీ ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలీదు. ఇలాంటి వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇంత ఎక్స్ ట్రార్డినరీ ఓపెనింగ్స్, నెంబర్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. హనుమాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ విజయం ప్రేక్షకులందరిది. అందరూ గొప్పగా ఆదరించారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారనేదానికి హను-మాన్ నిదర్శనం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఎదో ఒక దైవశక్తి మమల్ని నడుపుతుందని బలంగా నమ్ముతున్నాను.
 
విడుదలకు ముందు ఒత్తిడి వాతావణం కనిపించింది? అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేవి ?
చివరి పది రోజులుగా అసలు ఒత్తిడి తీసుకోలేదు. ప్రతిది అనుకున్నట్లుగా జరుగుతుందని నమ్మకం పెట్టుకున్నాం. ఇప్పుడు థియేటర్స్ ప్రతి ఆటకి పెరుగుతున్నాయి. ఇది తప్పకుండా నాలుగు వారాలు పైగా రన్ వుండే చిత్రమని ముందే బలంగా నమ్మాం. ఈ వారం చూడని మరో వారం ఖచ్చితంగా చూస్తారని భావించాం.
 
నిర్మాత కె నిరంజన్ రెడ్డి గారి గురించి ?
మా నిర్మాత నిరంజన్ రెడ్డి మాపై చాలా నమ్మకం ఉంచారు. దర్శకుడు, నిర్మాత నమ్మకం చూసి నేను మరో చిత్రం కమిట్ అవ్వలేదు. ఈ మధ్యలో ఏదైనా చిత్రం చేస్తే దాని ప్రభావం ఎంతో కొంత హనుమాన్ పై పడే అవకాశం వుంది. అలాంటి అవకాశం లేకుండా బలంగా నమ్మి హనుమాన్ చేశాను. ప్రేక్షకులతో కలసి ప్రిమియర్స్ చూశాను. వారి అద్భుతమైన స్పందన చూసి నా బరువంతా దిగిపోయినట్లు అనిపించింది. విజయాన్ని ఆస్వాదిస్తూనే సినిమాని ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ కు చేరువ చేయడానికి గురించి ఆలోచిస్తున్నాం. బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్తున్నాం. యూస్ వెళ్ళే ఆలోచన కూడా వుంది.
 
షూటింగ్ సమయంలో మీరు మంచి ఇన్ పుట్స్ ఇచ్చారని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు ?
ఒక నటుడిగా లొకేషన్ లో నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే మొహమాటం లేకుండా చెబుతాను. నాకు అనిపించిందంటే ప్రేక్షకుడికి కూడా అనిపించే అవకాశం వుంది కదా. దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు ఇన్ పుట్ ఎవరు చెప్పినా వింటారు. అది ఆయన గొప్పదనం. అంతిమంగా సినిమా అద్భుతంగా రావడమే అందరి లక్ష్యం. హనుమాన్ కి అందరం ఒక టీం వర్క్ గా పని చేశాం.
 
 హను మాన్ యాక్షన్ స్టంట్స్ అన్నీ ఒరిజినల్ గా చేశారా ?
హను మాన్ అన్నీ ఒరిజినల్ గా చేసినవే. అండర్ వాటర్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో గాల్లో వుండే సీక్వెన్స్ ఇవన్నీ రియల్ గా చేశాం. ఎయిర్ సీక్వెన్స్ లో  పొద్దున్న మేకప్ వేసుకొని రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని.  
 
హనుమాన్ లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ బాగా పండింది ? వరలక్ష్మీ శరత్ కుమార్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
వరలక్ష్మీ శరత్ కుమార్ గారు గ్రేట్ యాక్టర్. పెద్ద యాక్టర్ తో వర్క్ చేస్తున్నపుడు నేర్చుకునే అవకాశం వుంటుంది. పరస్పర సహకారంతోనే సన్నివేశాలన్నీ చక్కగా వచ్చాయి.  
 
ఇందులో హనుమాన్ విగ్రహం చూసినప్పుడల్లా చాలా దివ్యమైన అనుభూతి కలిగింది.. అది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ?
-ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు పట్టింది.    
 
హనుమాన్ గా చిరంజీవి గారు కనిపిస్తారేమో చాలా మంది భావించారు ? మీరు సంప్రదించారా ?
చిరంజీవి గారికి హనుమాన్ ప్రాజెక్ట్ గురించి తెలుసు. మా ఉద్దేశం కూడా చిరంజీవి గారికి తెలుసు. హనుమాన్ విషయంలో చిరంజీవి గారు చాలా ఆనందంగా వున్నారు. 12 తేదిన ‘కంగ్రాట్స్ మై బాయ్. సో ప్రౌడ్ ఆఫ్ యు ’ అని అభినందనలు తెలుపుతూ నాకు మెసేజ్ పెట్టారు.
 
హరిగౌర నేపధ్య సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది ? థియేటర్ లో చూసినప్పుడు ఏం అనిపించింది ?
ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ అండీ. కొన్ని సీన్స్ చూస్తూ డివైన్ ట్రాన్స్ లోకి వెళ్తున్నారు ఆడియన్స్. హనుమాన్ సినిమా మేము చేశామని అనుకోవడం లేదు. హనుమాన్ మాకు జరిగింది.  
 
హను మాన్ జర్నీలో మీరు నేర్చుకున్నది ?
ఓపికగా వుండటం నేర్చుకున్నాను.
 
కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. తర్వలోనే అనౌన్స్ చేస్తాం.