సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (23:20 IST)

ప్రశాంత్ వర్మ హనుమాన్ పిల్లలు మెచ్చే సినిమా ఫుల్ రివ్యూ

Hanuman poster
Hanuman poster
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 'హనుమాన్' రూపొందింది. తేజ సజ్జ కథానాయకుడిగా నటించాడు. వరలక్మి శతర్ కుమార్ ఆయన సోదరిగా నటించింది. కె నిరంజన్ రెడ్డి నిర్మాత. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హనుమాన్ ఈ శుక్రవారరమే అనగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
అసలు కథ:
చిన్నతనంలో చదువుకునే వయస్సులో వినయ్ వర్మకు సూపర్ మేన్, స్పైడర్ మాన్ అంటే ఇష్టం. వారి పుస్తకాలు వీడియోలు చూసి అడిక్ట్ అయిపోతాడు. పెద్దయ్యాక స్పైడర్ మేన్ దుస్తులతోనే బ్యాంక్ రోబరీలు చేస్తాడు. ఇక మరోవైపు అంజనాద్రి అనే ట్రైబల్ ఏరియాలో హనుమంతుని విగ్రహం వున్న ఊరిలో హనుమంతు (తేజ్ సజ్జ) పనీపాటాలేకుండా అక్క పెంపకంలో పెరుగుతుంటాడు.
 
మల్లయుద్ధం తెలిసిన ఊరి పెద్ద జనంపై చేస్తున్న ఆగడాలను నిలదీసినందుకు హనుమంతుపై మల్ల యుద్ధంలో ఏ కాలు ఆ కాలు కీలుకు కీలు విరిచేసి విరిచి పారేస్తాడు. అలా కొండపై నుంచి కింద జలపాతంలో పడిపోతాడు. అలా పడిన హనుమంతుకు ఓ దివ్వ మణి ఆలుచిప్పలో కనిపిస్తుంది. దాన్ని తీసుకుంటాడు. కట్ చేస్తే సముద్రం ఒడ్డున పడి వుంటాడు. ఊరిజనాలు ఆయన్ను తీసుకుని ఇంటికి తీసుకువస్తారు. దెబ్బలకు కట్టుకడతారు. ఆ తర్వాత హనుమంతుకు దొరికిన మణి సూర్యకాంతికి మెరిసి అతని కళ్లలో శక్తిని కలిగిస్తుంది. దాంతో హనుమంతుడులా బలవంతుడిగా మారిపోతాడు. 
 
ఈ మణి గురించి తెలిసిన వినయ్ రావు దాన్ని దక్కించుకునేందుకు హనుమంతుని ఊరి వస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు మణి కథ ఏమిటి? దానికి హనుమంతుడికి, రాముడుకి సంబంధం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
పురాణంలోని మణికథ:
పురాణాల్లో హనుమంతుడు పుట్టగానే బలవంతుడు. ఆకాశంలో ఎగిరి సూర్యుడ్ని పండు అనుకుని తినేందుకు ప్రయత్నిస్తాడు. అది చూసిన ఇంద్రుడు అస్త్రం వేయడంలో అది నుదిటి దగ్గర తగిలి మూర్చ పోతాడు. అలాా తగిలినప్పుడు చిన్నగాటుపడి రక్తం కారుతుంది. అలా కారిన బిందువు అంజనాద్రి అనే ఊరిలోని నదిలో వున్న ఆలుచిప్పలో పడుతుంది. అది మణిరూపంగా మారుతుంది. ఆ మణిలో హనుమంతుని మహిమ వుంటుంది. ఇది సజ్జనులకు దొరికితే సమాజానికి బాగుఅవుతుంది. 
 
విశ్లేషణ:
ఇది చెప్పాలంటే చాలా పెద్ద కథ. రామయణం కాలంనాటి చిన్న అంశాన్ని పురాణాల్లోంచి తీసుకుని దర్శకుడు అల్లిన కల్పిత కథ. క్రిష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్‌కు పవర్ వస్తుంది. ఆయన వెనుక యాక్షన్ కింగ్ అర్జున్ వుంటాడు. ఇందులోనూ హనుమంతుడికి పవర్ మణివల్ల వస్తుంది. కానీ ఆ మణి పోగొట్టుకున్నప్పుడల్లా విభీషనుడి రూపంలో సముద్రఖని  వచ్చి కాపాడుతుంటాడు. 
ఈ సినిమాను ఎన్.టి.ఆర్. నటించిన సూపర్ మేన్‌కు స్పూర్తిగా తీసుకున్నాడు కాబట్టి ఓ సీన్‌ను కూడా చూపిస్తాడు.
 
ఒక్క ముక్కలో చెప్పాలంటే మానువులకు, అసురులకు మధ్య జరిగే యుద్ధమే ఈ హనుమాన్ కథ. మానవుల్ని నాశనం చేయాలనుకునే అసురులాంటి మానవ మృగాలను హనుమంతుడు శిక్షిస్తాడు. దానిపైనే కథ. అందులో ఓ గ్రామం ప్రజలు, అసురుడు వంటి వినయ్ రావు ఆ మణిని పొంది ప్రపంచంలో శక్తిమంతుడిగా ఎదగాలనుకోవడం.
 
- అయితే ఈ మణి చిరంజీవి నటించిన అంజి సినిమాలో ఆత్మలింగం ఛాయలు కూడా కనిపిస్తాడు. హనుమంతుని మణి కూడా ఇంచుమించు అలానే కనిపిస్తుంది. కానీ సూర్య కిరణాలు పడితేనే అంతులేని శక్తి వస్తుంది. దీనికి దర్శకుడు ఉపయోగించిన విజువల్స్ ఎఫెక్ట్స్, డి.ఐ. ఇతర సాంకేతిక థ్రిల్ కలిగిస్తుంది.
 
- అయితే ఎక్కడా ఫీల్ అనేది కలగదు. హనుమంతు అక్కడ వరలక్మి శరత్ కుమార్ చనిపోయిన తర్వాత సముద్ర ఖని వచ్చి తాను విభీషనుడిని అని హనుమంతుడు నాకు అప్పగించిన పని నీ ద్వారా నెరవేర్చాలని వచ్చాను అంటాడు. ఆ తర్వాత ఎండింగ్ లో ఇంకా అసురులు పుట్టుకొస్తున్నారు కాబట్టి ఇది నావల్ల కాదు. ఇకపై భారం నీదే అంటూ రాముడు, హనుమంతుడు దగ్గరకు వచ్చి నువ్వే వచ్చి ప్రపంచాన్ని కాపాడాలని అంటాడు. అసురుడు చేసిన బాంబ్ కు మణి కూడా పగిలిపోయి అందులో వున్న రక్తం బిందు కిందపడుతూ... దాదాపు చావు దగ్గరకు వెళ్ళిన హనుమంతుని (తేజ్) నుదిటిపై పడుతుంది. దాంతో మరలా హనుమంతు బతికి వేలాదిగా పుట్టుకొస్తున్న అసురులను ఎలా ఎదుర్కొన్నాడు. ఊరికి ఉపద్రవం కాకుండా ఎలా కాపాడాడు? అనేది జై హనుమాన్ అనే రెండో పార్ట్‌లో చూడండి అని హిట్ ఇచ్చాడు.
 
నటీనటులు:
ఇందులో అందరూ బాగానే నటించారు. హనుమంతునిగా అమయాకత్వంతో కూడిన పాత్రను తేజ్ సజ్జ బాగానే సూటయ్యాడు. వరలక్మి బాగానే నటించింది. ఇతర పాత్రలు బాగానే వున్నాయి.
టెక్నికల్ గా శివేంద్ర కెమెరా పనితనం బాగుంది. కొత్త ఆవకాయ హనుమంతా అంటూ సాగే పాట బాగుంది. ఇతర టెక్నికల్ అంశాలతో కొత్త లోకంలోకి తీసుకెళ్ళాడు. ఈ మద్య వస్తున్న నరమేధం లాంటి సినిమాల మాదిరిగా కాకుండా హాయిగా పిల్లలతో చూసే సినిమా. ముగింపులో హనుమాన్ చాలీసానే వినిపిస్తుంది. ఓ దశలో సాహిత్యాన్ని, గాయకుల గాత్రాన్ని సంగీత రొద మింగేసింది.
రేటింగ్ : 3/5