బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2024 (11:03 IST)

సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ అబ్బ సొత్తు కాదు: మెగాబ్రదర్ నాగబాబు (video)

Nagababu
సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ అబ్బ సొత్తు కాదనీ, ఆ మాటకొస్తే ఇది ఎవడబ్బా సొత్తు కాదని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. అడవి శేష్ నటించిన చిత్రం ప్రి-రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ... ఈమధ్య కొంతమంది పనికిమాలినవాళ్లు సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ సొత్తు అంటూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకి నేను చెప్పేది ఒకటే. సినిమా ఇండస్ట్రీ అనేది మెగా ఫ్యామిలీ అబ్బ సొత్తు కాదు.
 
అలాగే అక్కినేని ఫ్యామిలీ కానీ, నందమూరి ఫ్యామిలీ అబ్బ సొత్తు కాదు. ఎవరికి టాలెంట్ వుంటే వాళ్లు ఇండస్ట్రీలో పైకి వస్తారు. ఇప్పుడున్న కుర్రాళ్లలో ఎవరు ఏ స్థాయికి చేరుకుంటారో ఎవరికి తెలుసు. అడవి శేష్ విషయాన్నే తీసుకోండి, అతడు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అయినా స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నాడు, కాబట్టి టాలెంట్ వుంటే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అని చెప్పారు.