నాగబాబు బర్త్‌డే పార్టీకి డుమ్మాకొట్టిన పవన్ కళ్యాణ్

nagababu bday
ఠాగూర్| Last Updated: బుధవారం, 30 అక్టోబరు 2019 (09:43 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్‌గా గుర్తింపు పొందిన నటుడు నాగబాబు. అటు నటుడుగా, ఇటు నిర్మాతగా, బుల్లితెరపై జడ్జిగా రాణిస్తున్నాడు. ఈయన పుట్టిన రోజు వేడుకలు అక్టోబరు 29వ తేదీ. అదే రోజు రాత్రి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా వచ్చి సందడి చేసింది.

ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, హీరో రామ్ చరణ్, కోడలు ఉపాసనతో పాటు హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్, నిహారిక, శ్రీజ ఇకా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.

ఈ మెగా పార్టీకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీపావ‌ళి రోజు అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి మ‌రీ పండుగ జ‌రుపుకున్న ప‌వ‌న్‌.. నాగ‌బాబు బ‌ర్త్‌డే రోజు రాక‌పోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు.
nagababu bday

పైగా, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో నాగబాబు క్రియాశీలక సభ్యుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన తరపున నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు కూడా. అంతేకాకుండా, తాను అన్నయ్య అయినప్పటికీ జనసేనలో మాత్రం ఓ సాధారణ కార్యకర్తగా ఉంటానని నాగబాబు పలుమార్లు చెప్పారు కూడా. అలాంటి నాగబాబు పుట్టినరోజు వేడుకలకు పవన్ రాకపోవడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.దీనిపై మరింత చదవండి :