తెలంగాణ ప్రభుత్వం థియేటర్లపై స్పష్టత ఇవ్వలేదు
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. అయినా ఎలక్షన్ల హడావుడి ప్రచారం ముగిసింది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్. వెనువెంటనే నేటినుంచి కర్వ్యూ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ఇది ప్రజలకు చేరువయింది. అందులో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉన్నట్టుగా తెలిపారు. అయితే ఈ కర్ఫ్యూలో భాగంగా ముందులానే మాల్స్ రెస్టారెంట్స్, థియేటర్స్ తదితర కాంప్లెక్స్ లు అన్నీ 8తో మూసి వెయ్యాలని ఒక్క వైద్యానికి సంబంధించినవి తప్ప అని సూచించారు.
దానితో థియేటర్లలో షోల సమయం మార్చాల్సిన అవసరం ఎంతైనా వుందని సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్‌లోని పెద్దల మాటల ప్రకారం, 11గంటల ఆట, మ్యాట్నీ, ఫస్ట్‌షో వేసిన మూడు షోలు ప్రదర్శించాల్సివుంటుంది. అయితే ఫస్ట్‌షో.. వదిలేసరికి 8.30గంటల దాటుతుంది. అందుకే జనాలు 9లోపు ఇళ్ళకు వెళ్ళాంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి. షో సమయాలను మార్చుకుంటున్నట్లు ప్రభుత్వానికి థియేటర్ల యాజమాన్యంతోపాటు ఛాంబర్ కూడా విజ్ఞప్తి చేసింది. దీనికి తగిన వెంటనే సమాధానం వస్తుందని వారు ఆశిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఈ సాయంత్రానికి క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇదిలా వుండగా మల్టీప్లెక్స్ థియేటర్లు తమకు అనుకూలంగా సమయాన్ని మార్చుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. అయినా థియేటర్లకు జనాలు పెద్దగా వస్తారని అనుకోవడంలేదని వెల్టడిస్తున్నారు.