మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (16:03 IST)

చిక్కుల్లో నయనతార - సరోగసీపై విచారణ కమిటీ

nayan - vicky
కోలీవుడ్ అగ్రహీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇదేవారిని చిక్కుల్లోకి నెట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరూ సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. 
 
దీనిపై నిగ్గు తేల్చేందుకు తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి గురువారం నుంచి విచారణ చేపట్టింది. రాష్ట్ర మెడికల్ డైరెక్టరేట్‌కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ విచారణ తర్వాత వారం రోజుల్లో పూర్తి నివేదికను వారు సమర్పించనున్నారు.