మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:29 IST)

ప్రకాష్ రాజ్ పెద్ద మనసు : పేద కుటుంబానికి అండ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పెద్ద మనసును చాటుకున్నారు. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబానికి ఆయన జేసీబీని అందజేశారు. 
 
తాను స్థాపించిన 'ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్' తరపున దీన్ని అందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ కుటుంబానికి జేసీబీ అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 
 
జీవితాన్ని తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆనందమే వేరన్నారు. ప్రస్తుతం వివిధ భాషల్లో ప్రకాశ్ రాజ్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల బిజీలో ఆయన ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో జీవిత, హేమ కూడా ఉన్నారు.