గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (10:50 IST)

అప్పుల వల్లే కల్యాణి విడాకులు కోరింది.. సూర్య కిరణ్

బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సూర్య కిరణ్ ఆ షో లో ఎక్కువ కాలం ఉండకుండానే బయటికి వచ్చాడు. అయితే ఆ కొన్ని రోజులకే తన ఆటతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
 
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన దర్శకుడిగా మారారు. అక్కినేని సుమంత్ నటించిన మొదటి సినిమా "సత్యం"కి దర్శకుడిగా పనిచేశారు. సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది.
 
అయితే తాజాగా సూర్యకిరణ్​.. తన మాజీ భార్య, నటి కళ్యాణి నుంచి విడాకులు తీసుకోవడంపై స్పందించాడు. తను సొంతంగా నిర్మించిన సినిమాలు ఆడకపోవడం వల్ల అప్పుల పాలయ్యానని, దాంతోనే భార్య కళ్యాణి తనను వదిలేసిందని చెప్పుకొచ్చాడు. అయితే వెయిట్ చేయి.. అప్పులు తీరాక మళ్లీ పెళ్లి చేసుకుంటానని కల్యాణితో చెప్పినట్లు సూర్యకిరణ్ వెల్లడించాడు.
 
15 ఏళ్ళ పాటు సంతోషంగా ఉన్న మా సంసారంలో ఎలాంటి గొడవలు కానీ, విభేధాలు కానీ లేవన్నారు. నాపై ఏమైనా కోపంగా ఉందా అని ఎన్నిసార్లు అడిగినా కళ్యాణి నోరు మెదపలేదని, విడాకులు మాత్రమే అడిగేదని చెప్పారు. నేను చేసిన అప్పులో, లేదా మాకు పిల్లలు లేరన్న బాధో ఆమెను విడాకుల వైపు నడిపించిందన్నారు.