సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:36 IST)

వందేళ్ళ సినీ చ‌రిత్ర‌లో శ్రీరెడ్డిలా ఎవ‌రు పోరాటం చేయ‌లేదు : వర్మ

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. టాలీవుడ్‌లోనేకాకుండా బాలీవుడ్‌లో సైతం శ్రీరెడ్డి గురించి చ‌ర్చ జ‌రుగుతుండ‌టం విశేషం. అంతేకాకుండా బాలీవుడ్ భామ కంగ‌నా సైతం శ్రీరెడ్డికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిం

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. టాలీవుడ్‌లోనేకాకుండా బాలీవుడ్‌లో సైతం శ్రీరెడ్డి గురించి చ‌ర్చ జ‌రుగుతుండ‌టం విశేషం. అంతేకాకుండా బాలీవుడ్ భామ కంగ‌నా సైతం శ్రీరెడ్డికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే ఈ అంశంపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు.
 
ట్విట్ట‌ర్‌లో వ‌ర్మ స్పందిస్తూ, వందేళ్ల సినిమా చరిత్రలో నటి శ్రీరెడ్డిలా ఎవరూ పోరాటం చేయలేదని కితాబిచ్చారు. ఈ మేరకు వర్మ వరుస ట్వీట్లు చేశారు. గత వందేళ్లలో క్యాస్టింగ్ కౌచ్‌పై దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చింది. ఆమె చేస్తున్న పోరాటానికి తన సెల్యూట్ అంటూ ప్రశంసించారు. 
 
అంతేకాకుండా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి ఆమె తల్లి గర్వపడాలని అభిప్రాయపడ్డారు. ఆమె అర్థన‌గ్న ప్ర‌ద‌ర్శ‌న ద్వారా నిర‌స‌న చేయ‌డం త‌ప్పంటున్న వాళ్లు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ విష‌యం గురించి చ‌ర్చించేలా చేసింద‌నే విష‌యాన్ని అంద‌రూ గుర్తించాల‌న్నారు.