ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (12:07 IST)

ఆర్ ఆర్ వెంకట్ కన్నుమూత.. ఆంధ్రావాలా మొదలై.. పైసా వరకు వచ్చారు..

RR Venkat
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కీడ్ని ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‏లోని ఏఐజీ హాస్పిటల్‏లో మృతి చెందారు. వెంకట్ మరణ వార్త విని ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్‏కు గురయ్యింది.
 
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆర్ఆర్ఆర్ వెంక‌ట్‌.. సామాన్యుడు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్ మాన్, డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించారు. 
 
అలాగే ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో డైవర్స్ ఇన్విటేషన్ అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. 2011లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. వెంకట్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.