టాప్ హీరోయిన్ల సెకండ్ బిజినెస్ ఇదే..!
నాటికి నేటికీ అన్ని రంగాల్లోను చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సినిమా రంగంలో అయితే చాలా మార్పు వచ్చింది. గతంలో అయితే హీరోలు, హీరోయిన్లకు లాంగ్ కెరీర్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఒక్క సిని
నాటికి నేటికీ అన్ని రంగాల్లోను చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సినిమా రంగంలో అయితే చాలా మార్పు వచ్చింది. గతంలో అయితే హీరోలు, హీరోయిన్లకు లాంగ్ కెరీర్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు... ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర వేసేస్తున్నారు. దీంతో ఆ హీరోయిన్లు ఆఫర్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న కొంతమంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దే పనిలో పడ్డారు.
తమకు వచ్చిన రెమ్యునరేషన్‌తో హీరోయిన్లు వివిధ వ్యాపారాలు చేస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తో బిజినెస్ చేస్తున్నారు. మరి ముందుచూపుతో బిజినెస్ చేస్తున్న ఆ హీరోయిన్లు ఎవరో.. వారు చేస్తున్న వ్యాపారాలేమిటో తెలుసుకుందాం. జ్యువెలరీ బిజినెస్ చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బిజినెస్ చేస్తూ మంచి లాభాల్ని అందుకుంటోంది తమన్నా. అటు సినిమాల్లోను... ఇటు జ్యువెలరీ బిజినెస్‌లో రాణిస్తూ బాగానే లాభాలు మూటగట్టుకుంటోంది.
ఇక ప్రణీత అయితే రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకువెళుతోందట. ఈ కన్నడ హీరోయిన్ ఆ భాషలో కన్నా తెలుగు సినీపరిశ్రమలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. తాను వ్యాపార వేత్తగా ఎదగాలన్నదే ప్రణీతకు ఇష్టమైన పనట. అందుకే బెంగుళూరులో బూట్ లిక్కర్స్ అనే రెస్టారెంట్‌లో భాగస్వామ్యమైంది. రెస్టారెంట్‌లో బాగానే ఆదాయం వస్తోందని తన స్నేహితులతో సంతోషంగా చెబుతోందట ప్రణీత.
కృతి కర్బందా. పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, రామ్‌తో ఒక సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగు సినీపరిశ్రమను వదిలేసి కన్నడ సినిమాల్లో నటిస్తోంది కృతి. దాంతో పాటు మీల్స్ అండ్ వీల్స్ పేరుతో ఒక రెస్టారెంట్‌ను సొంతంగా నడిపేస్తోంది. అమలాపాల్ థింగ్ బిగ్ స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను నడుపుతోంది. అటు సినిమాల్లోను ఇటు ప్రొడక్షన్ పనులను చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తోంది అమలాపాల్.
ఇక కాజల్ తన చెల్లెలు నిషాతో కలిసి జ్యువెలరీ బిజినెస్ చేస్తోంది. నాన్న, అమ్మ అంటే ఎంత ఇష్టమో.. నాకు చెల్లెలు కూడా అంతే ఇష్టమని.. కాజల్ ఎప్పుడూ చెబుతూ ఉంటుందట. అందుకే చెల్లెలికి, తనకు ఇష్టమైన జ్యువెలరీ షాప్‌ను ఎప్పుడో పెట్టుకోవాలని.. ఆ కోరిక కాస్త గత కొన్ని నెలల ముందు ఈ చందమామ భామ కాజల్‌కు తీరిందట. మారసాల పేరుతో జ్యువెలర్ షాపులను కాజల్ నడుపుతోంది.
ఇక శ్రియ అయితే మసాజ్ బిజినెస్‌ను నడుపుతోంది. కాస్త డబ్బులంటే చాలు మసాజ్ సెంటర్‌లకు వెళ్ళిపోతున్నారు కొందరు. అది గుర్తించిన శ్రియ శ్రీ పేరుతో ముంబైలో ఒక స్పా(మసాజ్) బిజినెస్‌ను నడుపుతోంది. తాప్సి అయితే వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తూ బిజినెస్‌లో చాలా బిజీగా ఉంది. స్నేహితురాళ్ళతో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరి పేరును పెట్టి బాగా సంపాదించేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ బిజినెస్ చేస్తోంది. హైదరాబాద్, వైజాగ్‌లలో జిమ్‌ను నడుపుతూ బాగా సంపాదించేస్తోంది. ఇలా టాప్ హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు.