ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2025 (16:53 IST)

మైథలాజికల్ పాయింట్‌తో రాబోతోన్న బార్బరిక్ హిట్ గ్యారంటీ : దర్శకుడు మారుతి

Maruthi, Satya Raj, Mohan Srivatsa and others
Maruthi, Satya Raj, Mohan Srivatsa and others
డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా  విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, ఉదయ భాను వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే  రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.
 
‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి..  ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. టీజర్‌లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూపించారు. ఇక టీజర్ చివర్లో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
 
మారుతి మాట్లాడుతూ, బార్బరిక్ సినిమా కోసం నేనేమీ పని చేయలేదు. ఈ టీంకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. విజయ్ గారు అతి తక్కువ టైంలోనే పెద్ద ప్రొడ్యూసర్ కానున్నారు. విజయ్ గారితో కలిసి జీతెలుగుతో మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. మోహన్‌లో చాలా ఎనర్జీ ఉంది. ఈ మూవీని చాలా చక్కగా తీశారు. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.
 
సత్య రాజ్ మాట్లాడుతూ..* ‘బార్బరిక్ టీంకు ఇక ప్రతి రోజూ పండుగే. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇకపై మేం అంతా రాజా సాబ్‌లమే. డైరెక్టర్ మోహన్ నాకు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు కథే హీరో. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి, రాజేష్ గారు టీంను చక్కగా చూసుకున్నారు. సత్యం రాజేష్ గారు సినిమాలో నాతో  పాటే ఉంటారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది. నన్ను తెలుగులో డబ్బింగ్ చెప్పమని అన్నారు. హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
 
నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ, బార్బరిక్ లాంటి పెద్ద సినిమాను చేస్తానని నేను అనుకోలేదు. ఈ మూవీ కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.
 
దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ, కథను నమ్మి నాకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు. మారుతి గారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ స్పూర్తినింపుతూనే ఉన్నారు. సత్యరాజ్ ఈ పాత్రను చాలా ప్రేమించారు. అర్దరాత్రి దాటినా షూటింగ్ చేస్తూ ఉండేవారు. వర్షంలోనే రాత్రి పూట షూటింగ్ చేస్తుండేవారు. సత్యం రాజేష్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వశిష్ట త్వరలోనే స్టార్ అయిపోతారు. సాంచీ చాలా మంచి అమ్మాయి. క్రాంతి మంచి స్టార్ అయిపోతాడు. బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు నాకు మూడు అస్త్రాలున్నాయి. ఒకటి డీఓపీ రమేష్, రెండు ఫ్యూజన్ బాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. ఈ మూడు అస్త్రాలతో నేను ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను’ అని అన్నారు.