కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు
హీరోయిన్ డింపుల్ హాయతి తన కెరీర్ కోసం పూజలు చేయించుకుంది. చాలా కాలంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అసలు సక్సెస్ రావడం లేదు. ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారు.
ఈ హీరోయిన్‌తో చేయించిన పూజలో వైన్ బాటిల్స్ కూడా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో రెండు వైన్ బాటిల్స్ ఉండడంతో అసలు వేణు స్వామి ఎలాంటి పూజలు చేయిస్తున్నారు అనే విధంగా నెటిజన్స్ నుంచి ఊహించిన విధంగా ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి.
తాను చేసే పూజలలో రాజేష్ శ్యామల, తార, చిన్న మస్త, వామాచార పూజలు ఎక్కువగా ఉంటాయి అని ఈ తరహా పూజలకు లిక్కర్ వాడతాను అని ఆయన బహిరంగంగానే వివరణ ఇచ్చారు.