ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం కన్నుమూత
ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం (77) చెన్నైలో నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆమెకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. దక్షిణాది భాషల్లో 10 వేల పాటలు పాడిన వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు. ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు నేపధ్యగానం చేశారు. అదేకాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు.
వాణి జయరాం తమిళనాడు వేలూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. తొలిసారి ఆల్ ఇండియా రేడీయోలో ఆలపించారు. పెళ్లి అయ్యాక భర్త జయరాం సపోర్ట్‌తో కర్నాటక, హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. వాణీ జయరామ్ భర్తగారు జయరామ్ 2018లో మరణించారు. వాణి జయరాం మృతి పట్ల తెలుగు చలచిత్ర సంగీత అసోసియేషన్ సంతాపం తెలిపింది. సంగీత దర్శకుడు కోటి ఆమె ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు.