గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (15:11 IST)

విద్యా బాలన్ సిస్టర్ ప్రియమణి వెరీ హాట్ గురూ... ఈ నెల నెట్ క్వీన్ పెళ్లి (ఫోటోలు)

ప్రియమణి... ఈమె మనకు బాగానే తెలుసు. కానీ ఆమె బాలీవుడ్ హాటెస్ట్ తార విద్యా బాలన్ సోదరి అని మాత్రం చాలామందికి తెలియదు. సోదరి అంటే తోబుట్టువు కాదు కానీ పిన్నమ్మ కూతురన్నమాట. విద్యా బాలన్ అటు బాలీవుడ్ ఇండ

ప్రియమణి... ఈమె మనకు బాగానే తెలుసు. కానీ ఆమె బాలీవుడ్ హాటెస్ట్ తార విద్యా బాలన్ సోదరి అని మాత్రం చాలామందికి తెలియదు. సోదరి అంటే తోబుట్టువు కాదు కానీ పిన్నమ్మ కూతురన్నమాట. విద్యా బాలన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో దున్నేస్తుంటే ఆమె చెల్లి ప్రియమణి దక్షిణాదిలో ఓ ఊపు ఊపింది. 
 
ఇంటర్ చదువుతుండగానే వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పరుత్తవీరన్ అనే తమిళ చిత్రంలో తన అద్భుత నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఎన్నో దక్షిణాది చిత్రాల్లో నటించిన ప్రియమణి గత ఏడాది ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం ఈ నెల 23న జరుగనుంది. 
 
ఐతే ఇంకా సినిమాల్లో నటిస్తానని అంటోంది. తన అక్క విద్యా బాలన్ పెళ్లయినా హాటెస్ట్ తారగా నటిస్తుండగా తనకు తక్కువేంటి అంటోంది. మరి పెళ్లయిన తారలను దక్షిణాది ఇండస్ట్రీ ఏమేరకు ఆదరిస్తుందో చూడాలి.