బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (20:15 IST)

విజయ నిర్మల @ 73... పుట్టినరోజు శుభాకాంక్షలు...

నటి, దర్శకురాలు విజయ నిర్మల 73వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాదులోని ఆమె స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఆమె తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం విజయ నిర్మల భర్త, సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడారు. తను విజ‌య నిర్మ‌ల దర్శకత్వం వహించిన 50 శాతం సినిమాల్లో

నటి, దర్శకురాలు విజయ నిర్మల 73వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాదులోని ఆమె స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఆమె తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం విజయ నిర్మల భర్త, సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడారు. తను విజ‌య నిర్మ‌ల దర్శకత్వం వహించిన 50 శాతం సినిమాల్లో తానే న‌టించానని వెల్లడించారు. 
 
విజయ నిర్మల చిత్రాల్లో నటించడమే కాదు... ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారని గుర్తుచేసుకున్నారు. గిన్నిస్ బుక్‌లో స్థానాన్ని సాధించిన విజయనిర్మల మరో రికార్డుకు చేరువలో వున్నారన్నారు. మరో ఐదారు చిత్రాల్లో నటిస్తే ఆమె 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా స్థానం దక్కించుకుంటారని అన్నారు. తమను ఎంతగానో అభిమానిస్తూ వుండే తమ అభిమానులే తమకు బంధువులని వ్యాఖ్యానించారు.