శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (12:46 IST)

ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కరోనా..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరిని వణికిస్తోంది. హిందీ చిత్రసీమలో చాలా మందీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వారిలో అమీర్ ఖాన్, ఆలియా భట్, బప్పీలహారి, మాధవన్, గోవిందా, అక్షయ్ కుమార్ లాంటీ వారు ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో నటి నివేదా థామస్‌కు దీని బారిన పడింది.

కాగా తాజాగా స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దీని బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో ఇటీవల ఆయనను కలిసిన వారు కచ్చితంగా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు.
 
ఆయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, తలైవితో పాటు హిందీలో పలు చిత్రాలకు రచయితగా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. తలైవి విడుదలకు రెడీ అవుతుండగా.. ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ ఎనిమిది నెలలు వాయిదా పడింది.
 
ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. 
 
దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.