విక్రమ్, కీర్తి సురేష్ 'సామి' మోషన్ పోస్టర్ విడుదల !

విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం సామీ స్క్వేర్. ఈ చిత్రాన్ని ఔరా సినిమాస్, పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై కావ్య వేణుగోపాల్, బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. సామి

vikram
Srinivas| Last Modified గురువారం, 24 మే 2018 (22:04 IST)
విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం సామీ స్క్వేర్. ఈ చిత్రాన్ని ఔరా సినిమాస్, పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై కావ్య వేణుగోపాల్, బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. సామి చిత్ర మోషన్ పోస్టర్‌ని సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు. 
 
ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే... మరొకసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ అదరగొట్టనున్నాడని తెలుస్తుంది. సింగం మూవీ సిరీస్‌కి దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ సినిమాలని తెరకెక్కించడంలో మంచి పట్టున్న హరి మరొకసారి అదే ఫార్ములాతో పోలీస్ స్టోరీ తెర‌కెక్కిస్తుండ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 
 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. విక్ర‌మ్‌కి ఈమ‌ధ్య కాలంలో స‌రైన హిట్ రాలేదు. మ‌రి... ఈ సినిమాతో అయినా స‌క్స‌స్ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :