మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:55 IST)

చీకటి సామ్రాజ్యానికి దేవుడిగా విక్రాంత్‌ రోణా

Vikrant Rona
ప్యాండమిక్‌ ఎర్లీ డేస్‌లో థియేటర్లలోకి రానున్న మెగా బడ్జెట్‌ సినిమా విక్రాంత్‌ రోణ. ప్రతి చిన్న అప్‌డేట్‌తోనూ సినిమా మీద హైప్స్ పెంచుతున్నారు మేకర్స్. మామూలు అప్‌డేట్స్ కే మెగా హైప్‌ ఇస్తున్న మేకర్స్ సూపర్‌స్టార్‌ బర్త్ డే సందర్భంగా ఒళ్లు గగుర్పొడిచే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించి, దడదడలాడించే వ్యక్తిగా విక్రాంత్‌ రోణాని పరిచయం చేశారు. లార్డ్ ఆఫ్‌ ద డార్క్ అంటూ కిచ్చా సుదీప్‌ని నెరేటర్‌ పరిచయం చేసిన తీరు నెక్స్ట్ లెవల్లో ఉంది. ది డెడ్‌మ్యాన్స్ యాంథమ్‌ అంటూ ఫస్ట్ గ్లింప్స్ ను ఇంట్రడ్యూస్‌ చేసిన తీరు మరో రేంజ్‌లో ఉంది. 
 
డైరక్టర్‌ అనూప్‌ బండారి మాట్లాడుతూ ''విక్రాంత్‌ రోణా ఫస్ట్ గ్లింప్స్ 'డెడ్‌ మ్యాన్స్ యాంథమ్‌'తో సుదీప్‌ సార్‌ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేయడం ఎక్స్ ట్రీమ్‌లీ హ్యాపీగా ఉంది. విక్రాంత్‌ రోణ మిస్టీరియస్‌ కేరక్టర్‌ని.. పర్ఫెక్ట్ గా పోట్రే చేసింది మా ఫస్ట్ గ్లింప్స్. నేను కథను అల్లుకున్నప్పుడు, సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు ఆ భారీతనాన్ని ఫీలయ్యాను. అందులోనూ టైట్యులర్‌ రోల్‌కి సుదీప్‌ సార్‌ ఎంట్రీ ఇవ్వగానే ఆటోమేటిగ్గా విజువల్స్ గ్రాండియర్‌నెస్‌ మరో రేంజ్‌కి వెళ్లాయి. ఆ హైతో మరోసారి సుదీప్‌గారికి హ్యాపీ బర్త్ డే చెబుతున్నా'' అని అన్నారు. 
 
నిర్మాత జాక్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ ''విక్రాంత్‌ రోణా ఫస్ట్ లుక్‌తో మా సుదీప్‌సార్‌కి వార్మెస్ట్ బర్త్ డే విషెస్‌ చెబుతున్నాం. ఫస్ట్ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. మొత్తం పాజిటివ్‌ నోట్‌లో ఉంది. ఆయన ఎనర్జీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్‌ విక్రాంత్‌ రోణాని మరో రేంజ్‌లో నిలబెట్టింది'' అని అన్నారు. 
 
విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరాపనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది. కిచ్చా సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.