శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (16:29 IST)

ఉరకలెత్తించేలా విశాల్ రత్నం నుంచి రా రా రత్నం.. పాట విడుదల

Ratnam song poster
Ratnam song poster
మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 
జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది.
 
విశాల్ ఇది వరకు ఎన్నడూ చూడని లుక్కులో, మాస్ అవతారంలో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. రా రా రత్నం అంటూ సాగే ఈ పాట రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఫుల్ రేసీగా, పవర్ ఫుల్‌గా అనిపించింది. నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి.  వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా అనిపించాయి.
 
ఈ రత్నం సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు.