మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 4 జులై 2024 (14:08 IST)

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

Vishwambhara dubbing shuru
Vishwambhara dubbing shuru
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు అనగా గురువారంనాడు డబ్బింగ్ పనులకు సంబంధించిన లాంఛనాలను ఒక పవిత్రమైన పూజా కార్యక్రమంతో ప్రారంభించింది చిత్ర యూనిట్. 
 
ఒకేసారి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 10, 2025 సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కాగా, సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి పరమ భక్తునిగా కన్పించనున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ బేనర్ లో ఈ చిత్రం రూపొందుతోంది.
 
మెగాస్టార్ చిరంజీవి, త్రిష, ఆషికా రంగనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు   వస్సిష్ట,  సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.