సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (16:09 IST)

సీసీఎల్ వల్ల క్రికెట్ మ్యాచులు ఆడాం ఇప్పుడు హంట్ చేసాం : తమిళ హీరో భరత్

hero Bharat
hero Bharat
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
 
బాయ్స్, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు మీరు? మరి తెలుగు చిత్రాల్లో నటించడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు?
నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో... అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. పైగా... సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్. సీసీఎల్ లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు కూడా ఆడాం. శ్రీకాంత్ గారు కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్. సో.. అన్నీ కుదిరి ఈ సినిమా ఓకే చేశా.
 
హంట్ మూవీ కథ ఎలా ఉండబోతోంది? మీ పాత్ర ఏంటి?
కథ మా ముగ్గురి (భరత్, శ్రీకాంత్, సుధీర్ బాబు) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది. 
 
ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. నటుడిగా కాకుండా హీరోగా కెరీర్ పరంగా సంతోషంగానే ఉన్నారా?
కోలీవుడ్ పరంగా సంతృప్తిగానే ఉన్నా. ఇండస్ట్రీలో మన ప్లేస్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. సో... నటుడిగా ఫ్లాపులు, హిట్లతో కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నా. అయితే, ప్రతి మూవీ ప్రాసెస్ ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నా. ఒక నటుడిగా అదే నాకు ఇంపార్టెంట్. 
 
తమిళ్, తెలుగు, మళయాళం  ఇలా మూడు భాషల్లోనూ నటిస్తున్నారు. వీటిల్లో మిగతా ఇండస్ట్రీలకీ, టాలీవుడ్ కి ఎలాంటి తేడాలు ఫీలయ్యారు?
స్టార్ట్, కెమెరా, యాక్షన్... ఏ భాష అయినా, ఏ ఇండస్ట్రీ అయినా అంతే! తేడాలంటూ ఏమీ పెద్దగా ఉండవు. కానీ, గత అయిదారేళ్లుగా తెలుగు సినిమాల స్కోప్, మార్కెట్ పెరిగింది. సరికొత్త కంటెంటుతో లార్జన్ దేన్ లైఫ్ కథలు వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్... ఇక్కడ సినిమాలు మిగతా సౌత్ భాషల్లో, అక్కడి సినిమాలు ఇక్కడా రీమేక్ అవుతున్నాయి. సో... ఒక ఇండస్ట్రీలో  విజయవంతమైన చిత్రాలను మరో ఇండస్ట్రీ రీమేక్ చేస్తున్నది.
 
భవ్య క్రియేషన్స్, నిర్మాత ఆనంద ప్రసాద్ గారి గురించి...
ఖర్చుకు వెనుకాడకుండా భవ్య క్రియేషన్ చాలా లావిష్, రిచ్‌గా ఫిల్మ్ తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకు వచ్చారు. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ఆలోచించే నిర్మాత ఆయన.
 
20 ఏళ్లలో చాలా పాత్రలు చేశారు. ఫలానా పాత్ర చేయాలని బలంగా కోరుకున్న రోల్స్ ఏవైనా ఉన్నాయా?
అందరూ యాక్షన్, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ స్క్రిప్ట్సుతోనే నన్ను అప్రోచ్ అవుతున్నారు. కానీ నాకు పూర్తి స్థాయిలో ఓ కామెడీ మూవీలో నటించాలనుంది. నేను ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. సో.. నేనసలు చేయగలనా? లేదా? అన్న సందేహం కూడా తీరినట్టుంటుంది. ఒక కంప్లీట్ రా ఏజెంట్ గా కూడా నటించాలనుంది. అలాంటి కథలొస్తే కచ్చితంగా చేస్తా.
 
తెలుగు సినిమాలు తరచుగా చూస్తుంటారా? టాలీవుడ్ లో ఎవరితో కలిసి వర్క్ చేయాలనుంది?
రెగ్యులర్ గా చూడను. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్.. వీళ్ల డైరెక్షనంటే బాగా ఇష్టం. అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాలో నటించాలనుంది. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. అప్పట్లో ఆ మూవీ రీమేక్ లో నేను చేయాల్సింది. నటుడిగా ఆయనంటే ఇష్టం.