బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (14:18 IST)

ఒక్కటి కాదు వంద సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నాం : తంగలాన్ హీరో చియాన్ విక్రమ్

Tangalan sucessmeet
Tangalan sucessmeet
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్" ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
లిరిక్ రైటర్ భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ -  "తంగలాన్" సినిమాలో మనకి మనకి పాట రాయకుంటే ఎంతో మిస్ అయ్యేవాడిని అనిపించింది. బలహీన వర్గాలకు బలమైన గొంతు పా రంజిత్. ఏ పాత్రలోకైనా మారిపోయే గొప్ప నటుడు చియాన్ విక్రమ్. తారాజువ్వ లాంటి సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్  కుమార్. ఇలాంటి వారితో "తంగలాన్" లాంటి గొప్ప సినిమాకు పాట రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ ధనుంజయన్ మాట్లాడుతూ, మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. మీ ఆదరణ వల్లే చెన్నై కంటే ముందు తెలుగులో సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. ఎంతో హార్డ్ వర్క్ చేసి టీమ్ అంతా "తంగలాన్" సినిమాను రూపొందించారు. మా టీమ్ కు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ కు, సపోర్ట్ చేసిన మీడియా వారికీ థ్యాంక్స్. అన్నారు.
 
రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ -  "తంగలాన్"  సినిమా మంచి కాంపిటేషన్ లో రిలీజైంది. అయినా మంచి సినిమా ఎప్పుడు రిలీజైన ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. ఈ సినిమా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుందని రిలీజ్ ముందే మేము చెప్పిన మాటలు ఇవాళ నిజం కావడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ -  "తంగలాన్"  సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. ఇది మీ కథగా మీరు భావించారు కాబట్టే విజయాన్ని అందించారు. ఇలాంటి మంచి సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పా రంజిత్, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.  "తంగలాన్"  మూవీని థియేటర్స్ లో చూడండి. మేము కూడా మీతో కలిసి థియేటర్ లో సినిమా చూడబోతున్నాం. అన్నారు.
 
హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ,  ఆరతి పాత్రకు నన్ను బాగా మేకోవర్ చేసిన నా పర్సనల్ టీమ్ కు థ్యాంక్స్. నేను ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నా. ఈ సక్సెస్ లో ఆయన లక్ కూడా కలిసొచ్చిందని అనిపిస్తోంది. అన్నారు.
 
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, నేను ఈ సినిమా సెట్ కు ఎక్కువగా వెళ్లలేదు. కానీ మేకింగ్ వీడియోస్ నాకు పంపినప్పుడు విక్రమ్ గారు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. ఆయన మీద నాకున్న గౌరవం వంద రెట్లు పెరిగింది. దర్శకులు పెన్ లో ఇంక్ నింపి కథ రాస్తారు. మా దర్శకుడు పా రంజిత్ రక్తాన్ని నింపి కథ రాస్తారు. సినిమా మేకింగ్ లో ఆయన రాజీ పడరు. మాకు ఒక ఎపిక్ మూవీని ఇచ్చిన పా రంజిత్ బ్రదర్ కు థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ సినిమాను ఓన్ చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు జాతీయ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నా. మాళవిక, పార్వతీ, పశుపతి, డేనియల్..ఇలా పెద్దా చిన్నా ప్రతి ఆర్టిస్టు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మీ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
 
దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ, బాధ్యత ఒత్తిడి దర్శకుడిగా నాపై పెరిగాయి. మాళవిక ఆరతి పాత్రలో ఎంతో బాగా నటించింది. ఆమె ఎనర్జీ ఆరతి పాత్రను మరింత అందంగా తయారు చేసింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనసు పెట్టి నటించారు. నా స్నేహితుడు జ్ఞానవేల్ రాజా మాకు అందించిన సపోర్ట్ ను మాటల్లో చెప్పలేను. ఆయనకు మూవీ మేకింగ్ పట్ల ప్యాషన్ ఉంది. అందుకే తంగలాన్ లాంటి బిగ్ మూవీని ఎంతో ప్రెషర్ తీసుకుని అనుకున్నట్లుగా రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మా సినిమాకు బలంగా మారింది. నా రైటర్స్, ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ, సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్ వీడియోలు చూస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తున్నాయి. అంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.  పా రంజిత్ కు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నమ్మకం వల్లే నేను తంగలాన్ చేయగలిగాను. తంగలాన్ కు పార్ 2 చేయాలని నేను పా రంజిత్, జ్ఞానవేల్ గారు అనుకున్నాం. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఒక్కటి కాదు వంద సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ కు తంగలాన్ పెద్ద హిట్ ఇచ్చింది. నెక్ట్ వచ్చే కంగువ రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ అవుతుంది. ఆయన మరో సినిమా కూడా రాబోతోంది. అది కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నేను తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్ కు వెళ్లినప్పుడు నా సినిమాలన్నీ చూశామని ఆడియెన్స్ చెప్పారు. ఓటీటీలో రిలీజైన నా సినిమాల గురించి కూడా వారు చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాళవిక ఆరతి పాత్రలో చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ మా సినిమాకు వస్తున్న ప్రతి ప్రశంసలో ఉన్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఫెంటాస్టిక్ జర్నీ చేస్తున్నారు. తంగలాన్ కు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ రోజు రెండు గొప్ప వార్తలు విన్నాను ఒకటి తంగలాన్ కు వస్తున్న మంచి కలెక్షన్స్, రెండవది పొన్నియన్ సెల్వన్ కు నాలుగు జాతీయ అవార్డ్స్ వచ్చాయని. ఈ రెండు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. అన్నారు.