ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (18:02 IST)

కొత్త ప్రాజెక్టులకు కమిట్ కాని నా సామి రంగ హీరోయిన్.. ఎందుకంటే?

Ashika Ranganath,
ఆషికా రంగనాథ్ కన్నడ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు కొట్టేసింది. కళ్యాణ్ రామ్ అమిగోస్‌తో తెలుగు సినిమాలో అరంగేట్రం చేసింది. ఆ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత నాగార్జున నటించిన "నా సామి రంగ"లో ఆమె కనిపించింది. ఈ చిత్రంలో ఆమె నటనతో గొప్ప ప్రశంసలను అందుకుంది. ఆమెకు పాపులారిటీ ఉన్నప్పటికీ, ఆమె తెలుగు సినిమాలో వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తుందని చాలామంది ఆశించారు. టాలీవుడ్‌లో లేటెస్ట్ క్రష్‌గా ఆమె పేరు వినిపిస్తోంది. 
 
అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లకు కమిట్ కాలేదు. ఆమెకు అనేక సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆమె తన ఎంపికలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె పెరుగుతున్న పాపులారిటీని ఎలా నావిగేట్ చేస్తుందో చూడాలి.