పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి..? అమీ జాక్సన్ బాటలో కల్కి

సెల్వి| Last Updated: శనివారం, 2 నవంబరు 2019 (12:06 IST)
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, హీరోయిన్ కల్కి కొచ్లిన్ ప్రస్తుతం బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈమెకు వివాహం అయ్యింది. ఇంకా భర్తతో విడాకులు కూడా తీసుకుంది. కానీ ప్రస్తుతం ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ప్రియుడితో వివాహం కాలేకపోయినా తల్లి కాబోతోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం దాల్చారు కూడా.

ప్రస్తుతం ఈ కోవలోనే కల్కి ప్రియుడితో పెళ్లికి ముందే గర్భం దాల్చింది.
పెళ్లికి ముందే ఈమె తల్లి కాబోతుంది. ఈ మధ్యే అమీ జాక్సన్ కూడా ఇలాగే పెళ్లికి ముందే అమ్మ అయిపోయింది. కల్కి విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది.

పైగా పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తుందంటూ క్లాస్ కూడా పీకేస్తుంది. అలాంటి సమాజం కోసం మన పద్దతులు.. పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ వేస్తుంది కల్కి. ప్రస్తుతం తాను తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది ఈ బ్యూటీ.దీనిపై మరింత చదవండి :