ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 జులై 2024 (11:25 IST)

ఈసారి అయినా సుందరకాండ తో నారా రోహిత్ సక్సెస్ అయ్యేనా?

Rohit Nara
Rohit Nara
హీరో నారా రోహిత్ ప్రస్తుతం వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తన ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం 'సుందరకాండ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ ఫన్ ఫిల్డ్ రోమ్-కామ్‌ను నిర్మిస్తున్నారు.
 
నారా రోహిత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నారా రోహిత్ ఇన్నోసెంట్ లుక్స్‌లో కూల్ డ్రెస్‌లో క్లాసీ, ఛార్మింగ్ గా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. "“No Two Love Stories Are The Same" అని పోస్టర్‌ పై ఉంది. సుందరకాండలో ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది. పోస్టర్ ద్వారా రివిల్ చేసినట్లుగా ఈ చిత్రం టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.
 
నారా రోహిత్ సరసన విర్తి వాఘని హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: రోహిత్ నారా, విర్తి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమఠం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు