ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (10:42 IST)

గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద అర్థనగ్నంగా మహిళ హల్చల్

geetha arts office
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సినీ నిర్మాణ కంపెనీ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఓ మహిళ అర్థనగ్నంగా హల్చల్ చేసింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా గీతా ఆర్ట్స్ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆ మహిళ ఆరోపించింది. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆమె.. తనకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. 
 
ఆ మహిళకు ఎంత సర్దిచెప్పినా పట్టించుకోకపోవడంతో గీతా ఆర్ట్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి పోలీస్ స్టేషన్‌ తరలించారు. ఆమె పోలీసులు కౌన్సెనింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆమెకు మానసికస్థితి సరిగా లేదని చెబుతున్నారు. అయితే, ఆ మహిళకు గీతా ఆర్ట్స్ కార్యాలయం ఒక్క పైసా కూడా బాకీ లేదని ఆ సంస్థ మేనేజర్లు చెబుతున్నారు.