1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

ఏలియన్స్‌ను ఆకర్షించేందుకు అంతరిక్షంలోకి నగ్న మహిళ

alien
ఏలియన్ అనేది అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. ప్రతి ఒక్కరూ ఈ గ్రహాంతర జీవుల ఉనికి గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతారు. అన్వేషిస్తున్నారు కూడా. ఈ పరిశోధనలో అనేక మంది శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు నిమగ్నమైవున్నారు. వీరంతా ఈ గ్రహాంతరవాసుల ఆనవాళ్లు, వివరాలను కనుగొనడానికి కృషి చేస్తూనే వున్నారు. 
 
ఇప్పుడు, నాసా శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల దృష్టిని ఆకర్షించడానికి మానవుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపే ప్రణాళికలో ఉన్నారు. నగ్నంగా ఉన్న పురుషుడు, స్త్రీ 'హలో' అని ఊపుతున్న పిక్సెలేటెడ్ ఇలస్ట్రేషన్‌ను వారికి ఆహ్వానం పలికేలా పంపాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిసింది. ఇది 'బీకాన్ ఇన్ ది గెలాక్సీ' (బిఐటిజి) అనే ప్రాజెక్ట్‌లో భాగం. గురుత్వాకర్షణ, డీఎన్ఏ యొక్క చిత్రణను కూడా శాస్త్రవేత్తలు పంపాలని యోచిస్తున్నారు.