వర్క్ అండ్ ఛిల్ల్ అంటోన్న మహేష్ బాబు
సినిమా షూటింగ్ అంటే సరదాగా చేసుకోవడమే అంటుంటాడు మహేష్ బాబు. ఇటీవలే తన సినిమా సంక్రాంత్రికి వాయిదా వేసుకుని శస్త్రచికిత్సకోసం అమెరికా వెళ్ళినట్లు ఆయన సన్నిహితులు తెలియజేశారు. తాజాగా సోమవారంనాడు మహేష్ బాబు కొన్ని ఫొటోలు పెట్టి వర్క్ అండ్ ఛిల్ల్ అంటూ కామెంట్ పెట్టాడు.
Mahesh Babu, Trivikram, Thaman, Nagavanshi
పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేశాడు మహేష్‌బాబు. ఆ తరువాత రాజమౌళితో మహేష్ సినిమా మొదలవుతుంది. తాజాగా మహేష్- త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభమైంది. అతడు, ఖలేజా తరువాత మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మహేశ్28 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన వార్త పంచుకున్నాడు.
త్రివిక్రమ్, థమన్, నాగవంశీ తో కలిసి దిగిన ఫోటోను మహేష్ షేర్ చేస్తూ” వర్క్ అండ్ ఛిల్ల్.. ఈ మధ్యాహ్నం ఈ టీమ్ తో పనులు సాగుతున్నాయి” అన్నాడు. ఈ మీటింగ్ దుబాయ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ చోట త్రివిక్రమ్‌తో కలిసి చర్చిస్తున్నట్లు పోస్ట్ చేశాడు త‌్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.