సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 15 జూన్ 2019 (20:56 IST)

ఇండియా వర్సెస్ పాక్ మోటివేషనల్ పోస్ట్ అంటూ పూనమ్ షాక్

పూనమ్ పాండే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తన గురించి చర్చించుకునేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విజృంభిస్తుంది. నిన్నగాక మొన్న అబినందన్ పైన వివాదాస్పద పోస్ట్ పెట్టి దిమ్మతిరగ్గొట్టిన పూనమ్ తాజాగా ట్విట్టర్లో ఇండియా వర్సెస్ పాక్ మోటివేషనల్ పోస్ట్ అంటూ బురఖాతో వున్న ఓ ఫోటోను, దుస్తులు లేకుండా మరో ఫోటోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది.
 
ప్రపంచకప్ 2019 సందర్భంగా ఆదివారం నాడు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఫోటోను పోస్ట్ చేసి తేడా కనిపెట్టండనే క్యాప్షన్‌తో దిమ్మతిరిగే ఫొటోను షేర్ చేసింది. పూనమ్ పాండే ఫర్ పాకిస్థాన్ అంటూ కళ్లు తప్ప మిగతా ఒళ్లంతా కప్పుకొని బురఖాలో ఉన్న ఫోటోను పెట్టింది. ఫర్ ఇండియా అని కళ్లు మినహా ఒంటిపై దుస్తులు లేని మరో ఫోటో జోడించింది. ఇప్పుడీ ఫోటో నెట్లో వైరల్‌గా మారింది.