సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Gulzar Ghouse

ప్రియా... నీకు ముద్దెట్టా పెట్టాలో...!!

ప్రతి ప్రియుడు తన ప్రియురాలిని ముద్దుపెట్టుకోవాలనుకుంటాడు. దాదాపుగా ప్రతి వారు తమ ప్రేమికులను ముద్దాడాలని తహతహలాడుతుంటారు. అది కూడా వద్దు..వద్దంటూనే.. ఆ ముచ్చట తీర్చేసుకుంటుంటారు.

తొలిసారిగా ప్రియులు తమ ప్రేమికులతో ముద్దాడాలనుకున్నప్పుడు కాస్త తొట్రుపాటు తప్పదు. మాట్లాడుతూనే ఎలా ముద్దాడుకోవాలో వారికి తెలియదంటున్నారు పరిశోధకులు. తొలిసారిగా తన చెలిని ముద్దాడడం ఓ సాహసం లాంటిదేనంటున్నారు. ఎందుకంటే ముద్దు పెట్టేటప్పుడు తన సఖి ప్రతిస్పందన ఎలావుంటుందనేది కాస్త అనుమానంగానే వుంటుందట.

సాధారణంగా ముద్దు సీన్లు మనం సినిమాలలో చూస్తుంటాం. కాని ఆ పద్ధతులు కాస్త సందేహాలకు తావిస్తాయి. మీరు తొలిసారిగా ముద్దాడుతుంటే మీ గుండె "లబ్‌డబ్" వేగం పెరిగిపోతుంది. ఆ తర్వాత రేయింబవళ్ళు మీరు మీ ప్రియమైన వారి గురించే ఆలోచిస్తుంటారు. తొలిముద్దు మీ రొమాన్స్‌కు పునాది. దీనిని ఓ తియ్యని అనుభూతిగా మలుచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయట... అవేంటో చూద్దామా...

తొలి ముద్దు ఎప్పుడు?
ప్రేమికులు కలిసిన తర్వాత తమతమ ఇండ్లకు వెళ్లేటప్పుడు ముద్దాడడం సరైన సమయం. దీనిని "గుడ్‌బాయ్ కిస్" అంటారు. తొలిసారిగా పెట్టే ముద్దుకు దీనికి మించి వేరే సమయం లేదు. ఒకవేళ మీరు మొదటి కలయికలోనే వారికి ముద్దు పెడితే వారిపై మీకున్న అభిప్రాయం తెలిసిపోతుంది.

ముద్దెట్టాలని ఎలా తెలుస్తుంది?
చాలామందికి ఎప్పుడు ముద్దుపెట్టాలో తెలియదంటున్నారు పరిశోధకులు. కాని ఎదుటి వారి హావభావాలు ముద్దు కావాలన్నట్లు అనిపించినపుడు ప్రియురాలు/ప్రియుడు తప్పకుండా ముద్దు పెట్టేస్తాడట. ఈ భావాన్ని పసిగట్టడం ప్రేమికుల పని. మాటిమాటికి మీ ప్రియురాలు మిమ్మల్ని తాకుతూ కూర్చొనివుంటే ముద్దెట్టమని భావం అని అంటున్నారు విశ్లేషకులు.

తొలిముద్దు ఎలా వుండాలి?
తొలిముద్దు అనేది ప్రేమికుల వ్యవహారాలకు సంబంధించి, ఆలోచనలకు గుర్తుగావుండాలి. కాబట్టి తొలిముద్దు చాలా మృదువుగా ఉండాలి. అది మీ సంబంధాన్ని బలపరిచేదిగా వుండాలి.

తొలిముద్దు ఇచ్చేటపుడు నోటి నుంచి లాలాజలం రాకుండా చూసుకోవాలట. కేవలం పెదాలతోమాత్రమే పెట్టే ముద్దైతే ప్రేమామృతాన్ని కురిపిస్తుందట. ఇది ప్రేమకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. తొందరపడి నోట్లో నోరు పెడితే ముద్దు ముచ్చట ముక్కలై ప్రేమ విఫలమైపోతుందట.

తొలిముద్దు ఎంతవరకుండాలి?
తొలిముద్దు అనేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమేవుండాలి. దీనికి సమయం అంటూ ఏదీ లేదు. కానీ ప్రియుడు/ప్రియురాలు ముద్దు పెట్టేటప్పుడు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరమేమీ లేదంటున్నారు "కిస్" నిపుణులు.

ప్రతి వ్యక్తికి ముద్దు పెట్టడంలో తనదంటూ ఓ స్టైల్ వుంటుంది. ఆ స్టైల్‌తోబాటు ఈ చిట్కాలు పాటిస్తే ఆ అనుభూతే వేరంటన్నారు. ఇంతవరకు మీ ప్రియురాలికి ముద్దు పెట్టకపోతే... ఈసారి ఖచ్చితంగా పెట్టండంటున్నారు. అదీ ముద్దు "మూడ్" ఉందన్న భావాలు వెలువడితేనే సుమా...!!