మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By ivr
Last Modified: గురువారం, 2 మార్చి 2017 (19:12 IST)

కూచిపూడి నృత్య నాటకాల రచనలకు ఆహ్వానం

కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనలకు అనువైన రచనలను ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డి. విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనల కోసం ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రదర్శనలకు విభిన్నంగా కొత్తకోణం

కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనలకు అనువైన రచనలను ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డి. విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనల కోసం ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రదర్శనలకు విభిన్నంగా కొత్తకోణంలో రచనలను ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్ విజయ్ భాస్కర్ చెప్పారు.
 
రచయితలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన చరిత్రలో జరిగిన గొప్ప ప్రేమ కథలు గానీ, యుద్ధ గాధను గానీ, మానవ నాగరికతను మలుపు తిప్పిన ఆలోచనపైగానీ, హాస్య భరితమైన ఇతివృత్తాంతాలనుగానీ, పౌరాణిక, సాంఘిక, చారిత్రక అంశాలపై రచయితలు దృష్టి సారించి, రచనలు చేయాలన్నారు. ఏప్రిల్ 30 లోపు భాషా సంస్కృతిక శాఖకు స్క్రిప్టులను పంపించాలని తెలిపారు. గుణ నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు వివరించారు.
 
ఒక్కో నాటకంలో 6 నుంచి 10 వరకు పాత్రలు ఉండాలని... నాయక, నాయికి, ప్రతినాయక ప్రవేశ దరువు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అవకాశమున్నచో నయికకు ‘లేఖ’ రచనా సన్నివేశం ఉండవచ్చని... సంక్షిప్తమైన వచనములు,చందోబద్ధమైన కందార్థము, సీసార్థముతోపాటు... ఇతర వృత్తములను వాడవచ్చని తెలిపారు. కాల పరిమితి 75 - 90 నిమిషాల మధ్య ఉండాలని... స్వీయ రచనగా  ధృవపత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు. న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయమని... రచనలు శిష్ట వ్యవహారికంలో ఉండాలని, అవసరమైన చోట మండలికాల్ని వాడవచ్చని చెప్పారు.
 
పోటీలకు పంపించే రచనలు ఇప్పటి వరకు ప్రదర్శించనివై ఉండాలని... ఉత్తమ కూచిపూడి నృత్య నాటకానికిగాను ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామన్నారు. బహుమతి పొందిన వాటిలో అర్హమైన వాటిని భాషా సంస్కృతి శాఖ ముద్రిస్తుందని... అటువంటి వాటికి తగిన పారితోషం ఇవ్వబడునని విజయ్ భాస్కర్ ప్రకటించారు. ఈ రచనలను ఎవరైనా ప్రదర్శించుకోనే అవకాశాన్ని భాషా సంస్కృతిక శాఖ కల్పిస్తుందని... పోటీకి పంపిన రచనలు తిరిగి పంపబడవని చెప్పారు.