1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (22:37 IST)

ప్రసిద్ధ రచయిత అమిష్ త్రిపాఠి కథలను ఇప్పుడు అన్ని భారతీయ భాషలలో వినవచ్చు

కథల్ని ఇష్టపడేవారికి అమిష్ త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమకాలీన రచయితలలో కాల్పనిక కథలు రాసేవారిలో ఆతను అగ్రగణ్యుడు. అతని కథలు ఆద్యంతం చదువరులలో అద్భుతాశ్చర్యాలు రేకెత్తిస్తాయి. ఇప్పుడు అమిష్ పుస్తకాలు 8 విభిన్న భాషలలో ఆడియో పుస్తకాలుగా స్టోరీటెల్లో అందుబాటులోకి వస్తున్నాయి.


శివ ట్రయాలజి, రామ చంద్ర సిరీస్ వంటి జనరంజకమైన పౌరాణిక థ్రిల్లర్లు, ఇమ్మోర్టల్ ఇండియా పేరుతొ రూపొందింపబడిన నాన్-ఫిక్షన్ వంటివి స్టోరీటెల్లో లభ్యమవుతాయి. అదనంగా యంగ్ ఇండియా, టైంలెస్ సివిలైజేషన్ అండ్ ధర్మ, డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఏ మీనింగ్‌ఫుల్‌ లైఫ్‌ వంటివి కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.

 
అమిష్ త్రిపాఠి కథలను హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, అస్సామీ మరియు మలయాళం వంటి 8 భాషలలో వినవచ్చు. తన రచనలు ఆడియో పుస్తకాల రూపంలోకి మారటం గురించి అమిష్ త్రిపాఠి మాట్లాడుతూ, “నా పుస్తకాలను ఇంగ్లీషులోనే కాక మిగిలిన భారతీయ భాషల్లో కూడా విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాను. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, అస్సామీ మరియు మలయాళంలో పుస్తకాలు ఆదరణ పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. 

 
వ్రాతపూర్వక పుస్తకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తామో… శ్రవణ పుస్తకాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే భారతదేశంలోని సమానత్వ భావనకు బలం చేకూరుతుందని నమ్ముతాను. 8 భారతీయ ప్రాంతీయ భాషలలో కథలను ఆడియో పుస్తకాల రూపంలో తీసుకురావటమన్న ఈ బృహత్ కార్యక్రమం వల్ల నా పుస్తకాలు ఎక్కువమందిని చేరుకోగలుగుతాయి. కథనం, రికార్డింగ్ వంటి సాంకేతిక అంశాలను స్టోరీటెల్ అద్భుతంగా నిర్వహించింది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.   

 
ఈ సందర్బంగా స్టోరీటెల్ ఇండియా కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్ మాట్లాడుతూ, “మన భారతీయ సనాతన సంస్కృతితో ప్రతీ ఒక్కరు మమేకం అవ్వడానికి అమిష్ రచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నేటి యువత వారి రచనలను ఆస్వాదించడమే కాక వాటి ప్రభావంతో ఆలోచిస్తున్నారు కూడా. అమిష్ పుస్తకాల గురించి రాబోయే తరాలవారు గొప్పగా మాట్లాడుకుంటారు. స్టోరీటెల్లో ఆయన పుస్తకాలు 8 భాషల్లో తర్జుమాచేసి ఆడియో పుస్తకాల రూపంలో అందిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.  ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఆనందించగల గొప్ప కథలు స్టోరీటెల్ లో అందుబాటులో ఉండటం మాకు ఎంతో సంతోషకరమైన అంశం.” అని అన్నారు.