నేను పిరికివాడిని కాదు.. భార్యంటే భయమే లేదు..
భర్త : నేను పిరికివాడిని కాదు.. నాకు భయం అంటే తెలియదు. ముఖ్యంగా నువ్వంటే నాకు అసలు భయం లేదు అన్నాడు కోపంగా... భార్య : ఓహో.. అవునా???? భర్త : హ.. అవునే అవును.
భర్త : నేను పిరికివాడిని కాదు.. నాకు భయం అంటే తెలియదు. ముఖ్యంగా నువ్వంటే నాకు అసలు భయం లేదు అన్నాడు కోపంగా...
భార్య : ఓహో.. అవునా????
భర్త : హ.. అవునే అవును.
భార్య : పెళ్లి చూపులకు నన్ను చూడటానికి 5-7 మందిని తీసుకొచ్చారు.. పెళ్లికి 400-500 మందితో వచ్చారు. అవునా కాదో చెప్పండి.
భర్త : అవునే.. అవును వచ్చాను.. అయితే, ఇపుడేంటి?
భార్య : కానీ, నన్ను చూడండి.. మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను. ఇపుడు చెప్పండి.. ఎవరు పిరికివాళ్లో.. ఎవరికి భయమో?
భర్త : అఁ..