రెండూ ఒకటేగా...?!
"సుమన్..! నీకు లెక్కల్లో ఎందుకు తక్కువ మార్కులొచ్చాయి?" ప్రోగ్రెస్ కార్డు చూస్తూ అడిగాడు తండ్రి.
"టీచర్ రెండు మూళ్లెంత అని అడిగింది. ఆరు అని చెప్పాను. తర్వాత మూడు రెళ్ళెంతా అని అడిగింది..." చెప్పాడు సుమన్.
"రెండు లెక్కలకీ తేడా ఏముంది?" మళ్లీ అడిగాడు తండ్రి.
"అదే... నేనూ టీచర్‌ని అడిగాను".