శుక్రవారం, 3 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:23 IST)
క్రితం ఏడాది కూడా ఇలాగే చెప్పావే!
రాము: నీ వయస్సెంత?
సోము: పన్నెండు సంవత్సరాలు
రాము: క్రితం ఏడాది కూడా నువ్వు ఇలాగే చెప్పావే!
సోము: అయితే ఏంటట. నేను మాట మీద నిలబడే రకాన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జగిత్యాలలో ఘోరం.. ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి
జగిత్యాలలో ఘోరం జరిగింది. బుధవారం రాత్రి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతులు మదాసు అమర్నాథ్ (17), పడాల రిశ్వంత్ (17), కోల మయాంక్ (16) ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ట్రక్కు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు యత్నాలు.... 35 దేశాలకు ఆహ్వానం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమ ప్రాదేశిక ప్రాంతంలోని హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఇంధన రవాణాల అత్యంత కీలకమైన ఈ జల రవాణా మార్గాన్ని మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తి, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇరాన్‌ను బుజ్జగించి జలసంధి మార్గాన్ని తెరిపించేందుకు బ్రిటన్ నడుం బిగిచింది. ఇందుకోసం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి భారత్ సహా 35 దేశాలను ఆహ్వానించింది. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశానికి భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు.
అమెరికా సైన్యంలో కీలక పరిణామం... ఆర్మీ చీఫ్ జార్జ్ తొలగింపు
ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం కొనసాగుతున్న కీలక తరుణంలో ఆర్మీ అత్యున్నత అధికారిపై వేటువేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనరల్ జార్జ్ వెంటనే పదవీ విరమణ చేస్తున్నారని పెంటగాన్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఇరాన్‌ను రాతి యుగంలోకి పంపుతాం.. ఎత్తైన వంతెనను పేల్చివేసిన అమెరికా
ఇరాన్‌ను రాతి యుగంలోకి పంపుతామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞను నెరవేర్చేలా అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఇరాన్‌పై విరుచుకుపడ్డాయి. ట్రంప్ హెచ్చరిక చేసిన కొన్ని గంటలకే ఇరాన్‌లోని అత్యంత కీలక నిర్మాణాల్లో ఒకటైన వంతెనపై భీకర దాడి జరిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని కరాజ్ నగరంలో పశ్చిమాసియాలో అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా సేనలు పాక్షింగా కూల్చివేసింది.
బతికుండగా వారిని కలవనివ్వలేదు ... కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి...
ఇటీవల బెంగుళూలులో తనువు చాలించిన టెక్కీ దంపతుల దీనగాథ వింటే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చక తప్పదు. మతాంతర వివాహం చేసుకున్నందుకు కుటుంబ సభ్యులు దూరమయ్యారు. కన్నతల్లి మాట కరువైంది. కృత్రిమ మేథ కారణంగా రూ.లక్షల్లో వేతనం ఇచ్చే ఉద్యోగం పోయింది. దీంతో భవిష్యత్ బతుకు అగమ్యగోచరంగా మారింది. దీంతో చావే శరణ్యమని భావించిన భర్త ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాణంగా ప్రేమించిన భర్త కళ్లముందే చనిపోవడాన్ని జీర్ణించుకోలేని భార్య.. తాము ఉండే 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. అయినప్పటికీ కుటుంబ సభ్యుల పగ చల్లారలేదు. ఇద్దరి మృతదేహాలను వేర్వేరు అంబులెన్స్‌లలో సొంతూళ్లకు తరలించేందుకు సిద్దమయ్యారు. కానీ, వారి స్నేహితులు మాత్రం అందుకు అంగీకరించలేదు. బతికుండగా వారిని కలవనివ్వలేదు.. కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి అంటూ ప్రాధేయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యుల మనసు కరిగి అంగీకరించారు. ఈ విషాదకర ఘటన బెంగుళూరులో జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?
రాత్రి వేళ నిద్రా భంగం కాకుండా వుండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. నిద్రకు ఇబ్బందికరంగా మారే 9 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది. మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది. చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు. కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.