బ్రోచెవారెవరురా సినిమా చేయడానికి కారణం అదే - హీరో శ్రీ విష్ణు
శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. చలనమే చిత్రము.. చిత్రమే చలనము.. అనేది ట్యాగ్ లైన్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన బ్రోచేవారెవరురా చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరో రామ్, నారా రోహిత్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో శ్రీ విష్ణు చిత్ర విశేషాలను తెలియచేస్తూ...బ్రోచేవారెవరుగా స్టోరీ వివేక్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. టైటిల్ ఏంటంటే `బ్రోచేవారెవరురా` అని అన్నారు.
సరే `బ్రో` అని అనుకునేవాళ్లం. ఈ కథలో `మిత్ర` అనే పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. ఆ కేరక్టర్ ఎవరు చేస్తారా? అని ఎదురు చూశాను. దానికి భరతనాట్యం, కూచిపూడి చేయాలి. `నిన్నుకోరి`లో ఆమె డ్యాన్సులు చూశాం. ఈ సినిమాలో ఆమె డ్యాన్సులు చూసి ఈ చిత్రంలో ఎలా చేస్తారోనని అనుకున్నాం. ఆమె 20 రోజులు అరుణ మేడమ్ దగ్గర డ్యాన్సులు నేర్చుకున్నారు. పొట్టోళ్లు గట్టోళ్లు అని అంటారు కదా... అలా నివేదా చాలా కష్టపడి డ్యాన్సులు నేర్చుకుంది. ఒకరోజు నేను కిటికీ నుంచి చూశాను.
ఎగిరెగిరి డ్యాన్సులు చేసింది. సత్య, నివేదా పేతురాజ్ చాలా బాగా చేశారు. సత్య కేరక్టర్‌లో ఇంకెవరినీ ఊహించుకోలేం. ఈ ప్రాజెక్ట్లో నాకు కొత్తగా పరిచయమైంది వివేక్ సాగర్. చాలా టాలెంటెడ్ వ్యక్తి. వివేక్ సాగర్ పాటలు వింటే ఇళయరాజాగారి పాటల్లా అనిపించింది. ఆయనంత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరక్టర్ వివేక్ సాగర్. మా కెమెరామేన్ మమ్మల్ని చాలా బాగా చూపించారు. మా ప్రొడ్యూసర్లు మూడు సార్లు హైదరాబాద్ వచ్చారు. ఏం కావాలన్నా ఇచ్చేవారు. `బాగా చేయండి సార్` అంటూ ప్రోత్సహించేవారు.
డైరక్షన్ డిపార్ట్ మెంట్ టీమ్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. సినిమా మొత్తం సరదా సరదాగా పూర్తయింది. మంచి సినిమాలు తీయగానే సురేష్‌బాబు గారిలాంటి వాళ్లు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేస్తున్నాను. దానికి చాలా ఆనందంగా ఉంది. ప్రియదర్శి, రాహుల్‌తో షూటింగ్‌లో ఉన్నంత సేపు నవ్వుతూనే ఉంటాం.
28న మా సినిమా వస్తోంది. `బ్రోచేవారెవరురా`ను కేవలం మిత్ర అనే పాత్ర కోసం చేశాను. ప్రతి అమ్మాయీ మిత్రే. నేను కేవలం ఆడపిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంటన్నది సినిమాలో చూడండి. నవ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు. వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడితే నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. వివేక్ ఆత్రేయ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఏడిపించగలిగే ఏకైక మగాడు ఉన్నాడంటే ఆయన వివేక్ ఆత్రేయ`` అని అన్నారు.