శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 4 మే 2019 (14:33 IST)

"ఏడు చేపల కథ"తో టాలీవుడ్ ఎటు పోతుందో? అమృతాంజనం అక్కడ పూసి మరీ...

ఏడు చేపల కథ సెన్సేషనల్ టీజర్‌తో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. గతంలో విడుదల చేసిన టీజర్స్‌తో సంచలనం సృష్టించింది. ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఊపును ప్రదర్శిస్తూ మరో టీజర్‌ను విడదల చేశారు. మొదటి టీజర్‌ను మించిన రెస్పాన్స్ ఈ టీజర్‌కు వస్తోంది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టీజర్‌తో ట్రేడ్ సర్కిల్స్‌లో విపరీతమైన చర్చ జరుగుతోంది. పూర్తి అడల్డ్ కామెడీ జోనర్లో కొత్తవారితో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో బిజినెస్ స‌ర్కిల్లో హ్యూజ్ బ‌జ్ రావ‌టం విశేషం. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.
 
ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు... ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి గీపెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున  MeToo అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను "ఏడు చేపల కథ" చిత్రంతో పరిచయం చేస్తున్నార‌ట‌.
 
పూర్తి అడల్డ్ కామెడీ జోనర్లో రూపొందించిన ఈ చిత్రం యెక్క టీజ‌ర్‌కు అద్భుతమైన స్పందన లభిచింది. ట్రేడ్ సర్కిల్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుందని... త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర నిర్మాత చెబుతున్నారు. యూట్యూబ్‌లో సంచ‌ల‌న సృష్టించిన టెమ్ట్ ర‌వి తెరపై ఇంకెంత సంచ‌ల‌నం సృష్టిస్తాడో చూడాలి.
 
కాగా ఇప్పటికే ఈ టైపు చిత్రాలపై విమర్శలు సైతం భారీఎత్తున వస్తున్నాయి. తాజా టీజర్లో ఓ యువతికి యువకుడు అక్కడ అమృతాంజనం పూసి మరీ శృంగారం చేయడం చూస్తుంటే ఇక టాలీవుడ్ ఏటైపులోకి వెళ్తుందోనన్న ఆందోళనలు సైతం వెల్లువెత్తుతున్నాయి.