Saree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ
రామ్ గోపాల్ వర్మ సమర్పణలో గిరీష్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన చిత్రం శారీ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నటి ఆరాధ్య దేవి తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం రెండు నెలలముందు విడుదలకావల్సింది. ఎట్టకేలకు ఏప్రిల్ 4న విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలచేసినట్లు చెప్పారు.
"కథ మొత్తం సారీ చుట్టూ తిరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఆమె పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనది. అందుకే ఈ టైటిల్ ఎంచుకున్నాం" అని వర్మ ప్రమోషన్ లో భాగంగా వివరించారు. ఇంకా ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ కథాంశాన్ని మరింత వివరిస్తూ, కథానాయకుడు ఒక ఫోటోగ్రాఫర్, అతను ఈ అమ్మాయిని చీరలో చూస్తాడు. అతనికి ఆమె పేరు కూడా తెలియదు అలాంటి వారిమధ్య ఎటువంటి ప్రేమ వుంది అనేది తెలుసుకోవాలంటే సినిమాలోకి వెళ్ళాల్సిందే.
కథ:
పక్షుల్ని ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్ కిట్టు (సత్యయాదు) ఓరోజు పార్క్ లో ఆరాద్యదేవి తన స్నేహితులకు హావభావాలతో కూడిన ఫొటోలు ఇస్తుంటే అది చూసిన కిట్టు ఆమెపై మోహం పెంచుకుంటాడు. ఆమెకు తెలీకుండా రకరకాలుగా ఫొటోలు తీస్తూ ఆమెకు వెంబడిస్తాడు. పేరు కూడా తెలుసుకుంటాడు. ఇంటిలో ఆమెకు సెపరేట్ రూమ్ ఏర్పాటుచేసి డిఫరెంట్ ఫొటోలను చూసి ప్రేమ ఉన్మాదిగా మారిపోతాడు. సోషల్ మీడియా ఇన్ స్ట్రాలో యాక్టివ్ గా వుండే ఆరాద్య ఫ్రొఫెల్స్ చూసి మెసేజ్ లు పెట్టి ఫొటో షూట్ చేస్తానంటాడు. ఆమె వెంటనే ఒప్పుకుంటుంది. తన సోదరి ప్రవర్తనకు విసిగిపోయిన ఆరాద్య అన్న ఎన్నిచెప్పినా వినకపోవడంతో కిట్టుకు వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ తో కిట్టులో సైకో బయటికి వచ్చి ఆరాద్య కుటుంబాన్ని చంపేసి ఆమెను తనదాన్నిగా చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. మరి ఆ తర్వాత కిట్టు ఏం చేశాడు? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
కథలోని అంశం వినగానే సైకో ప్రేమకథ అని ఇట్టే తెలిసిపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం రాజమండ్రిలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథ రూపొందించబడింది. నా బిజీ షెడ్యూల్ కారణంగా, ఈ సినిమా దర్శకత్వాన్ని కమల్‌కి అప్పగించాను, ఎందుకంటే అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది." అంటూ వర్మ రిలీజ్ కు ముందు చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో ఏమి జరిగిందో తెలియదుకానీ సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలీని వారితో ప్రేమలో పడితే ఎలా వుంటుందనేది చెప్పదలిచానని అందుకే ఈశారీ తీశానని వర్మ చెప్పాడు.
సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం వర్మకంటే ఉద్దండుడు మరొకరు లేడని జనాభిప్రాయం. ఆ సోషల్ మీడియా ద్వారానే ఆరాద్య దేవి అనే అమ్మాయిని (సినిమాపేరు పెట్టుకున్నాడు) ఎంచుకుని ఆమె చుట్టూ కథ అల్లాడు. ఈ సినిమాలో శారీ ఎలా కట్టాలో అనేది కూడా వర్మే ఆరాద్యకు చెప్పినట్లుంది. తన కూతురు చీర మోజులో అదరాలు, బొడ్డు అంతా కనిపించేట్లుగా వున్నా కన్న తల్లికూడా అలా కట్టకూడదు అని చెప్పదు. ఆమె స్నేహితులు కూడా సరైన దుస్తులు ధరిస్తారు. తెలిసీ తెలియని తనంతో అపరిచిత వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం ఫొటో షూట్ అనగానే వెళ్ళడం వంటివి ఈనాటి జనరేషన్ లో కొంతమంది ఇలా వున్నారనే చెప్పే ప్రయత్నం చేశాడు. సత్యయాదు పాత్రలో సైకో ఎలా వుంటాడో చూపించాడు. బహుశా వర్మ తనను అతనిలో చూసుకున్నట్లుగా వుందనే కామెంట్లు వినిపించాయి.
రక్తపాతాలు, దెయ్యాలు, భూతాలు వంటి సినిమాలు తీస్తూ జనాలను భయపెట్టాలనుకునే వర్మ ఈసారి శారీ అనే పిచ్చ సినిమా తీశాడనే చెప్పాలి. దర్శకత్వం కోర్సులో శాడిజం, హింస మోతాదు మించి చూపించకూడదు. కానీ రానురాను ఆ మాట మర్చిపోయి చాలామంది హింస అనేది జుగుప్సాకరంగా చూపిస్తూ ప్రజల్లో నాటుకునేలా చేస్తు క్యాష్ చేసుకుంటున్నారు.
ఈ కథలో చాలా అనవసరమైన సన్నివేశాలున్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం. తన సోదరి ఎక్కడకువెళ్ళినా ఫాలో అయి ఆమెను ఇంటికి తీసకువచ్చే అన్న, క్లయిమాక్స్ కుముందు అర్థరాత్రి ఆటోలో బయటనుంచి రావడం చూపిస్తాడు. ఇంట్లో కూతురు వుందో లేదో అనే యావ కూడావారికి వుండదు. తెల్లారి తర్వాత గానీ రూమ్ లో కూతురు లేదని తల్లి చెప్పడం, అన్న అవాక్కవడం వంటివి చవకబారు దర్శకులు తీసే సన్నివేశాలు. అలాగే అనవసరమైన రెండు పాటలు పెట్టి యూత్ ను ఎట్రాక్ట్ చేయాలనుకున్నాడు. కథ మొత్తం గంట లో చెప్పొచ్చు. దాన్ని రెండుగంటలకు పైగా అసందర్భమైన సీన్స్ లో సాగతీశాడు.
ఈ సినిమా కేవలం హీరోయిన్ అందాల్ని ఆరబోయడంలొో వర్మ కేర్ తీసుకున్నాడు. హీరోగా నటించిన సత్యయాదు ఆమెతో ఎంజాయ్ చేశాడు. కెమెరామెన్ గా బ్యూటీనెస్ ను కాప్షర్ చేశాడు. వీరి ముగ్గురికి మినహా ఎవరికీ ఉపయోగపడని సినిమా శారీ. సినిమా చూశాక సారీ వర్మ అనడం ఈ సినిమా ప్రత్యేకత.
రేటింగ్ : 1/5