బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా మలిచిన అధర్వ.. రివ్యూ
కౌసల్య కృష్ణమూర్తి, దీర్ఝ ఆయుష్మాన్ భవ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వంటి నటించిన కార్తీక్ రాజు తాజాగా అధర్వ సినిమాను చేశారు. శుక్రవారంనాడు విడుదలకాబోతున్న ఈ చిత్రాన్ని ముందుగానే ప్రముఖులకు ప్రివ్యూను ప్రదర్శించారు. కార్తీక్ రాజు సిమ్రన్ చౌదరి ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించారు. మహేష్ రెడ్డి దర్శకుడు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు.
కథ
ఊరిలో వుండే యువకుడు దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) పోలీస్ కావాలని కలలు కంటాడు. ప్రయత్నాలు చేసినా అతనికున్న ఆస్తమా సమస్యతో పలుసార్లు ఫెయిల్ అవుతాడు. దాంతో విసిగిపోయిన కర్ణకు స్నేహితుడి సలహా మేరకు క్లూస్ టీంలో ఖాళీలు వున్నాయని తెలిసి అప్లయి చేసి జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఓ టీమ్ లో చేరి తన తెలివితో ఓ దొంగతనం కేసును తేలిగ్గా పరిష్కరిస్తాడు.
అదే సమయంలో క్రైం రిపోర్టర్ గా పనిచేస్తున్న తన క్లాస్ మేట్ నిత్య (సిమ్రన్ చౌదరి)ను చూసి ప్రేమించేస్తాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. అయినా ఇద్దరూ కలిసి హత్య కేసుకు సంబంధించి ఇన్ పుట్స్ షేర్ చేసుకుంటారు. ఈ దశలో నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) సినిమా హీరోయిన్ ఇంటికి ఇద్దరూ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆమె ప్రియుడు శివ శవాలై పడి ఉంటారు. ఇదంతా శివ కావాలని చేశాడని కేసును పై అదికారులు క్లోజ్ చేస్తారు. కానీ కర్ణకు అనుమానం వచ్చి రీసెర్చ్ చేసే క్రమంలో సస్పెండ్ కు గురవుతాడు. ఆ తర్వాత ఏమయింది? కర్ణ అనుమానం నిజమేనా? వాళ్లిద్దరినీ ఎవరు చంపారు? అసలేం జరిగి ఉంటుంది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష..
క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జానర్లలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ క్లూస్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడమే అథర్వలో కొత్త పాయింట్. ఇందులో బయో కెమిస్ట్ గా కార్తీక్ రాజు పాత్ర ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్‌తో ఉన్న టైంలో కామెడీ, కేసును చేదించే టైంలో సీరియస్ నెస్, ప్రేయసితో ఉన్నప్పుడు లవ్ యాంగిల్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు. క్లూస్ టీమ్ చేసే కొన్ని పనులు ఆలోచించి ఏ విధంగా సాల్వ్ చేయాలో అనేది బాగుంది.
హీరోయిన్ సిమ్రన్ చౌదరి, సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి. దర్శకుడు మహేష్ రెడ్డి రాసుకున్న కథ, కథనం బాగుంది. ఈ ఫార్మాట్‌లో ఇది వరకు చాలానే కథలు వచ్చాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే చిత్రాలు ఒకసారి చూశాక.. రెండో సారి ట్విస్టులు అన్నీ తెలిసిపోవడంతో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ అథర్వ మాత్రం అలా అనిపించకపోవచ్చు. మొదటి భాగం కాస్త నెమ్మదించినా దేని కోసం పోలీసు కావాలనే ఎయిమ్ అనేది తెలీక గందర గోళంగా అనిపిస్తుంది.
కానీ సెకండాఫ్ లో తను చెప్పే కథ, కథనం చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి. దాంతో పెద్దగా బోరింగ్ లేకుండా కథనాన్ని దర్శకుడు నడిపించిన తీరు బాగుంది. అయితే హీరోయిన్ ను చంపిన హంతుకులు కోణంలో కర్ణ చేసే పరిశోధనలో ఆసక్తిగా అనిపిస్తాయి. ఫైనల్ గా ఓ కార్పొరేట్ సంస్థ అధినేత చేసే కిరాతకాలు కోణాన్ని చూపి భారీ సినిమాగా దర్శకుడు చెప్పదలచిచాడు. అందుకే ముగింపులో అధర్వ అంటూ కర్ణను సంబోధించే రాతలు ఓ హత్య కేసులో అద్దం పై రాయడంతో ఇది వాడి పనే అని చిన్న క్లూ ఇచ్చి వాడు ఎవడు? అనేది సీక్వెల్ లో తెలుసుకోవాల్సిందే అనే ట్విస్ట్ కూడా ఇచ్చాడు.
దాంతో అథర్వ రెండో పార్ట్‌కి కూడా మంచి లైన్‌ను రెడీ చేసుకున్నాడు. ఇలా మొత్తానికి దర్శకుడు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడనిపిస్తోంది. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. కెమెరామెన్ చరణ్ మాధవనేని ఇచ్చిన విజువల్స్ కథకు అనుగుణంగా నడిపాయి. శ్రీ చరణ్ పాకాల పాటలు బాగుంటాయి. దానికితోటు ఇటువంటి సినిమాకు రీరికార్డింగ్ కీలకం. దాన్ని బాగా చేశాడు. ఎడిటర్ ఈ సినిమాను సెకండాఫ్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిర్మాతలు మంచి సినిమా తీశారని చెప్పవచ్చు. ఎటువంటి వల్గారిటీ లేకుండా కుటుంబంతో సహా చూసే విధంగా క్రైం సస్పెన్స్ కథలు రాని తరుణంలో ఈ సినిమాలు అంధరూ ఫీలయి చూసేలా వుంది. అక్కడడక్కడా చిన్నపాటి లోపాలున్నా కథనం స్పీడ్ కప్పేసింది. దాంతో ప్రేక్షకుడు రెండో పార్ట్ కోసం వెయిట్ చేసేలా దర్శకుడు చూపిన విధనం బాగుంది.
రేటింగ్ 3/5