బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:43 IST)

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

Devara latest still
Devara latest still
ఎన్.టి.ఆర్. దేవర సినిమా ఈరోజే ఓవర్ సీస్ లో విడుదలైంది. బిజినెస్ పరంగా దాదాపు అక్కడే ఓవర్ సీస్ లో బాగా జరిగింది.  వరల్ వైడ్ గా 300 కోట్ల బిజినెస్ అయిందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు, నైజాంలో 45, సీడెడ్ 20 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్లు, గుంటూరు 8.5, వెస్ట్ 6.5, క్రిష్ణ 7 కోట్లు, తమిళనాడు 8కోట్లు, కర్నాటకలో 16 కోట్లు, కేరళలో 2.5 కోట్లు. మొత్తం ఇండియాలో 175 కోట్లు బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.  ఇంత బిజినెస్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇండియా వైజ్ 300 కోట్లు కలెక్్ట చేస్తే కానీ రికవరీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా.
 
కాగా, యు.ఎస్.లో ఈరోజే షో పడింది. అక్కడా బిజినెస్ పరంగా ప్రీ రిలీజ్ బ్రహ్మాండంగా జరిగింది. ఆర్.ఆర్. ఆర్. తర్వాత ఎలా తీశారంటనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈరోజు అనిరుధ్ కూడా అద్భుతమైన సినిమా అని కితాబిచ్చాడు. దానికితో మంచి అంచనాలకు చేరింది.
 
కథగా చెప్పాలంటే..
సముద్రపరిసరాల్లో 10 గ్రామల ప్రజలు వుంటారు. అది ట్రైబల్ ప్రాంతం. సముద్రంలో వచ్చే షిప్ లను దోచుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ క్రమంలో తమ వద్ద వున్న ఆయుధాలతో చంపుతుంటారు. అందులో రెండు గ్రామాలకు పెద్ద గ్యాంగ్ గా శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్ వుంటారు. అందులో దేవర పాత్ర పెద్ద ఎన్.టి.ఆర్. ఆయన వారసుడు చిన్న ఎన్.టి.ఆర్. పేరు వర. దేవర ధైర్యవంతుడు, వర పిరికివాడు కాబట్టి అతన్ని ధైర్యవంతుడిగా చేశారా? లేక దేవరే మళ్ళీ బతికి వచ్చి పగతీర్చుకున్నాడా? అక్కడి ప్రజలను నీతిమంతులుగా మార్చాడా? అన్నది మిగిలిన కథ. 
 
సమీక్ష: 
బాహుబలి లాగా ప్రభాస్ తరహా పాత్ర దేవరలా అనిపిస్తుందట. అలాగే సముద్రంలో పోరాటాలు పొన్నియన్ సెల్వమ్ లో వున్నా అంతకుమించి కొరటాల శివ ఇందులో చూపించారు. ఫస్ట్ పార్ట్ లో 3 గంటలు వచ్చింది. దానిని  కొంత కట్ చేశారని తెలిసింది. ఫస్టాఫ్ సీనియర్ దేవర కథ వుంటుంది. 
 
అయితే కొన్ని సర్ ప్రైజ్ అంశాలు వున్నాయి. అవి చూస్తేనే బాగుంటుందని ఓవర్ సీస్ ప్రేక్ఖులు చెబుతున్నారు. దేవర సముద్రంలో  వుండే షార్క్ తో పోరాడి దాన్ని వాహనంగా చేసుకునే ఎపిసోడ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వున్నా, విజువల్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో చివరి 30 నిముషాలు చాలా బాగుందని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. 
 
అయితే ఎన్.టి.ఆర్. ఈ తరహా పాత్రలు ఇప్పటివరకు అదేవిధంగా కొరటాల శివ ఇలాంటి కథను చేయలేదు. రాజమౌళి తరహాలో ఈ సినిమా వుంటుందట. ఆయుధాలు ఈ సినిమాలో భాగం. ట్రైబల్ ఉపయోగించే ఆయుధాలను పూజిస్తారు. చాలా రకాల ఆయుధాలు ఇందులో కనిపిస్తాయి. తల్లిగా మరాఠి నటి నటన బాగుంది.ఇక జాన్వీ పాత్ర కూడా నచ్చుతుంది. అయితే కామెడీ కథలో భాగమే కానీ పెద్దగా లేకపోవడంతో సీరియస్ కథగా సాగడంతో మాస్ యాక్షన్ అంశాలతోపాటు కొత్త కొత్త విషయాలు ఇందులో కొరటాల శివ చూపించాడు. సో. మొత్తంగా దేవర మొదటి పార్ట్ ఫ్యాన్స్ కు పండగలా వుంటుందని తెలుస్తోంది.