మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (22:17 IST)

కళ్యాణ్ రామ్ - తమన్నాల రొమాన్స్ 'నా నువ్వే' ఎలా వుందంటే?

భారీ అంచనాల మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా విడుదలైన చిత్రం నా నువ్వే. ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న తాపత్రయం కళ్యాణ్ రామ్ లో కనిపించింది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేసాడు. కథ విషయానికి వస్తే... వరుణ్‌ (కల్యాణ్ రామ్‌) నమ్మకాలు లేన

సినిమా పేరు : నా నువ్వే, నటీనటులు : కల్యాణ్ రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళీ, ప్రవీణ్‌; దర్శకత్వం : జయేంద్ర, నిర్మాత : మహేష్‌ ఎస్‌. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి
 
భారీ అంచనాల మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా విడుదలైన చిత్రం నా నువ్వే. ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న తాపత్రయం కళ్యాణ్ రామ్ లో కనిపించింది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేసాడు. కథ విషయానికి వస్తే... వరుణ్‌ (కల్యాణ్ రామ్‌) నమ్మకాలు లేని యువకుడు. అమెరికాలో ఉద్యోగ అవకాశం వస్తుంది. దానితో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబ సభ్యుల పట్ల పెద్దగా బాంధవ్యాలు వుండవు. ఎలాగైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొన్ని అవాంతరాల వల్ల అతడి ప్రయాణం క్యాన్సిల్ అవుతుంటుంది. మరోవైపు మీరా(తమన్నా) అనుకోకుండా వరుణ్ ఫోటోను చూసి అతడి లవ్‌లో పడిపోతుంది. దీనికి కారణం వుంటుంది. 
 
అదేమిటంటే... వరుణ్ ఫోటో చూసినప్పుడల్లా ఆమె అనుకున్నది కలిసి వస్తుంది. అందువల్ల అతడంటే ఆమెకు ఇష్టం కలుగుతుంది. ఫోటోలో వున్న వరుణ్‌ను స్వయంగా కలిసి అతడికి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. కానీ వరుణ్ ఆమె ప్రేమను వెంటనే యాక్సెప్ట్ చేయడు. ఆమెకు ఓ టెస్ట్ పెడతాడు. ఆమె అందులో నెగ్గుతుంది. ఇక ఇద్దరికి ఎలాంటి అడ్డంకి లేదనుకున్న సమయంలో మీరా తండ్రి తనికెళ్లి భరణి వారి ప్రేమను నిరాకరిస్తాడు. మీరా తండ్రి అడ్డు చెప్పడం అటుంచి అనుకోని పరిస్థితుల్లో వరుణ్ ఆమె నుంచి దూరమవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీరా-వరుణ్ కలుసుకున్నారా అనేది మిగిలిన సినిమా.
 
ఇక విశ్లేషణ చూస్తే... కళ్యాణ్ రామ్ అనగానే మాస్ ఇమేజ్ అనేది తెలిసిందే. మరి అలాంటి హీరోతో రొమాంటిక్ స్టోరీ నడిపించాలంటే చాలానే కసరత్తు చేయాలి. ఇందులో దర్శకుడు అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయాడని అనుకోవచ్చు. కొన్నిచోట్ల ఎమోషన్లు మిస్ అయినట్లనిపిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు లాగించినా ప్రేక్షకుడు స్టోరీలో సింక్ అయ్యేవిధంగా స్క్రీన్ ప్లే చేయలేకపోయినట్లు కనిపిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు వారివారి పరిధి మేరకు నటించారు. వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌ తదితర కామెడీ నటుల నుంచి మరింత కామెడీని రాబట్టాల్సింది. సన్నివేశాలు రిచ్ గా కనిపిస్తాయి. మాస్ హీరోగా కనిపించిన కళ్యాణ్ రామ్, తమన్నాతో కలిసి నటించిన ఈ రొమాంటిక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.