శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (12:18 IST)

సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ రివ్యూ రిపోర్ట్: మాస్టర్ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్..

సచిన్ టెండూల్కర్ క్రీడా ప్రస్థానాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ డాక్యుమెంటరీ, డ్రామా క్రికెట్ దేవుడు జీవితాన్ని తెరపై చూపించారు. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన సచిన్‌ను

సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ రివ్యూ.. 
నటీనటులు.. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్క్, మయూరేష్ పేమ్ తదితరులు 
దర్శకత్వం : జేమ్స్ ఎర్స్కీన్
జానర్ : బయోపిక్ 
నిడివి : 2 గంటల 19 నిమిషాలు
విడుదల : మే 26 (శుక్రవారం) 
రేటింగ్ : 4/5
 
స్టోరీ : సచిన్ టెండూల్కర్ క్రీడా ప్రస్థానాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ డాక్యుమెంటరీ, డ్రామా క్రికెట్ దేవుడు జీవితాన్ని తెరపై చూపించారు. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన సచిన్‌ను నేటి యువత మార్గదర్శకంగా తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఈ సినిమాలో చొప్పించారు.
 
సచిన్ చిన్నతనం, వ్యక్తిత్వం, సతీమణి అంజలి, పిల్లలు అర్జున్, సారా.. కుటుంబ స్నేహితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపెట్టారు. ఈ కథను సచినే రాశారు. తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన విజయాలు.. గాయాలను ఇందులో బాగా చూపెట్టారు. సచిన్ నటన సినిమాకు హైలైట్ అయ్యింది. తన బయోపిక్‌లో తానే నటించడం పట్ల సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్‌కు ఇన్నాళ్లు క్రికెట్ ట్రీట్ ఇచ్చిన సచిన్.. వెండితెరపై కూడా తన సత్తా ఏంటో చాటాడు. 1989లో పాకిస్థాన్‌కు చెందిన అబ్ధుల్ ఖాదర్ విసిరిన ఒక ఓవర్లో నాలుగు సిక్సర్లు సాధించిన ఘట్టాన్ని, 1998లో చెన్నై టెస్టులో షేన్ వార్న్ బౌలింగ్‌లో అదరగొట్టిన వైనాన్ని తెరపై చూపించారు. క్రికెట్లో సచిన్ సాధించిన విజయాలే కాకుండా.. మాస్టర్ భావోద్వేగ సన్నివేశాలను ఈ చిత్రంలో చూపించారు. రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్న సమయంలో సచిన్ ఎదుర్కొన్న విమర్శలు, కొన్ని మ్యాచ్‌ల్లో రాణించలేకపోవడంలో తనకు ఎదురైన పరిణామాలను సచిన్ ఇందులో పొందుపరిచారు. సచిన్ సహచరులు ధోనీ, కోహ్లీ, గంగూలీ, సెహ్వాగ్‌ల మద్దతు గురించి కూడా తెలిపాడు. క్రికెట్ గొప్పతనాన్ని తెరపై చూపడం ద్వారా యువతకు మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్ సచిన్ మార్గదర్శకమవుతాయని క్రికెట్ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
సచిన్ సినిమా ప్లస్‌లు: 
సచిన్ టెండూల్కర్ జర్నీ, భారత క్రికెట్ గొప్పదనం
మైనస్ : 
ఆసక్తికరమైన స్టోరీ లైన్.. స్క్రీన్ ప్లే లేకపోవడం.. 
అయినా సచిన్ ఫ్యాన్స్‌కు కనెక్ట్ అవుతుంది. 
 
నటీనటులు.. 
సచిన్ క్రికెటర్‌గానే కాదు.. నటుడిగానూ అదరగొట్టాడు. హార్షా భోగ్లే, బోరియా మజుందర్ పాత్రలకు న్యాయం చేశారు. విరాట్ కోహ్లీ, ధోనీ, సెహ్వాగ్, రికీ పాంటింగ్, షేన్ వార్న్, బ్రియాన్ లారా, వాసిమ్ అక్రమ్ పాత్రలు సినిమాకు హైలైట్. 1999 ప్రపంచ కప్ సందర్భంగా తన తండ్రిని కోల్పోయిన చేదు వార్త వచ్చినా.. 140 పరుగులు సాధించి.. ఆ సెంచరీని తండ్రికి అంకితమిచ్చిన సన్నివేశాన్ని దర్శకుడు బాగా హైలైట్ చేశాడు. రిటైర్మెంట్ స్పీచ్‌ సన్నివేశం కంట తడిపెట్టించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సినిమాకు పాజిటివ్ మార్కులు సంపాదించిపెట్టింది. సచిన్ యాంథమ్ అదిరిపోయింది. 
 
తుది తీర్పు...  సచిన్:ఎ బిలియన్ డ్రీమ్స్ మాస్టర్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్. వాస్తవికతతో కూడిన భావోద్వేగాల సమాహారంగా.. యువతకు ఆదర్శప్రాయంగా సచిన్ బయోపిక్ నిలుస్తుంది.