1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (14:14 IST)

మళ్లీ పెళ్లి నరేష్‌, పవిత్ర లోకేష్‌ల కథ అవునా! కాదా! రివ్యూ రిపోర్ట్‌

naresh-pavitra
naresh-pavitra
విజయనిర్మల కొడుకు నరేష్‌, పవిత్ర లోకేష్‌ల సహజీవనం గురించి ఇటు తెలుగు ప్రేక్షకులకు, అటు కన్నడ రాష్ట్రంలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకు కేవలం సోషల్‌మీడియా, టీవీ ఛానల్స్‌ ప్రమోషన్‌ వల్లే ఇది జరిగిందనేది తెలిసిందే. అప్పటికే మూడో భార్య రమ్య కు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో కలిసి వుండడం అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇది వ్యక్తిగతం. కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ పెళ్లి అనే చిత్రం రావడంతో అసలు ఇందులో ఏం చెప్పదలిచారు? అన్నది ఆసక్తిగా మారింది. అందుకు తగిన ప్రమోషన్‌ కూడా ఎక్కువే జరిగింది. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా లో వాళ్లు ఏంచెప్పారో చూద్దాం.
 
కథ:
నరేంద్ర (నరేష్‌) ఓ నటుడు. షూటింగ్‌లో వుండగా పవిత్ర నటిగా పరిచయం అవుతుంది. వారిద్దరూ కలిసి కొన్ని సన్నివేశాల్లో నటిస్తారు. అది ప్రేమగా మారుతుంది. ఆ క్రమంలో ఇద్దరి వ్యక్తిగతాలను ఒకరినొకరు చెప్పుకునే స్థాయికి చేరుతుంది. ఓ దశలో పవిత్రను తన తల్లి విజయనిర్మల (జయసుధ), తండ్రి కృష్ణ (శరత్‌బాబు)కు పరిచయం చేస్తాడు నరేంద్ర. ఆ తర్వాత పవిత్ర తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో చనిపోవాలనుందనే వాట్సప్‌ మెసేజ్‌తో తెలుసుకుకన్న నరేంద్ర నేరుగా పవిత్ర ఇంటికి వెళ్ళి ఆయన భర్త రైటర్‌ కూడా కావడంతో ఓ కథ వుంది అడ్వాన్స్‌ ఇద్దామని వచ్చానంటూ ఓ కథ చెబతాడు. అది తన కథ అని తెలుసుకుకన్న పవిత్ర భర్త నరేంద్రతో గొడవపడతాడు. దాంతో పవిత్ర తల్లి అక్కడి వచ్చి మా అమ్మాయి నీ శాడిజం వల్ల చాలా నష్టపోయింది. గెట్‌ ఔట్‌ ఫ్రమ్‌ మై హౌస్‌ అంటూ పంపిచేస్తుంది. అప్పటినుంచి నరేంద్రపై పగపెట్టుకున్న పవిత్ర భర్త, ఇంకోవైపు అప్పటికే నరేంద్ర పెండ్లిచేసుకున్న రమ్యతో కలిసి మీడియా ద్వారా తాము అనుకున్నదని సాధించుకోవాలనుకుంటారు? అందుకు వారు ఏవిధంగా ప్లాన్‌ చేశారు? తర్వాత ఏమయింది? అన్నది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఈ కథలోనే నరేష్‌ వైవాహిక జీవితం ఇలా వుంది అని చెప్పేశాడు. మూడో భార్య రమ్య రఘుపతి ఓ సైకోలా ప్రవర్తించడం ఆమె కేవలం డబ్బుకోసమే తనను పెండ్లి చేసుకుందనే పాయింట్‌ వెల్లడించాడు. ఆ తర్వాత పవిత్ర బర్త కూడా ఓ రకమైన సైకోనే. ఉన్నత వర్గానికి చెందిన అతను తక్కువ కులానికి చెందిన పవిత్ర ఫేమ్‌ను, ఆస్తులను ఎలా తెలివిగా కైవసం చేసుకున్నాడనేది ఇందులో చూపించారు. ఇవన్నీ ప్రతిసారీ ఒక్కో మీడియాకు ఒక్కో రాష్ట్రంలో చెప్పాలంటే సాధ్యపడదు, ఇదో పెద్దతలనొప్పి కనుక అందుకే సినిమా తీసేసి అందరికీ చెప్పేస్తే ఓ పనైపోతుంది అన్నట్లుగా మళ్లీ పెళ్లి తీశారని స్పష్టమవుతోంది.
 
అందుకే నేపథ్య సాంగ్ లో ‘ఇది మా కథ. మేం కాకుండా ఇంకెవరు చెబుతారు’.. అనేది మెలోడీ వాయిస్ తో ఆద్యంతం రన్‌ అవుతుంది. అక్కడే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ కథలో ఏఏ పాత్రలు ఎలా ప్రవర్తించారు. పోలీసులు, మీడియాలో కొందరు ఏవిధంగా డైవర్ట్‌చేసి తమ పబ్బం గడుపుకున్నారనేది తెలిపాడు. సినిమాకు మొదటి పార్ట్‌ కన్నా సెకండ్‌ పార్ట్‌ కీలకం. అది బాగుంటేనే సినిమా హిట్‌. అదే జీవితానికి వర్తింపజేయాలనేది తమ మళ్ళీ పెళ్లి సినిమా అని నిర్భయంగా చెప్పేశారు. ఈ పాయింట్‌ చాలామందికి కనెక్ట్‌ అయింది. అందుకే వారిని సమర్థించేవారు చాలా మందే వున్నారు. 
 
ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ పెళ్లి అనేది నరేష్‌, పవిత్ర పెళ్లి  బయోపిక్‌. ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్పీ చెప్పనట్లుగా అటు దర్శకుడు ఎం.ఎస్‌. రాజు, నరేష్‌, పవిత్రలు చెబుతూనే మధ్యలో మా కథే అని కూడా చెప్పేశారు. కానీ అది ఫ్లోలో అలా చెప్పామనుకున్నారేమో.. ఇది బయోపిక్‌ కాదు. ఎం.ఎస్‌.రాజుగారు రాసిన కథలో కొంత వాస్తవం, కొంత కల్పితం కలిపే ఈ సినిమా అని చెప్పారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది ఏది? కల్పితం ఏది? అనేది కూడా వారు చెబితేకానీ తెలీదు. 
 
ఎందుకంటే నరేష్‌ మూడో భార్య రమ్య శాడిజం వున్న మహిళ. అటువైపు పవిత్ర భర్త అదో రకం శాడిస్టు. ఈరెండు పాత్రలు దేశంలో వున్నవే. కానీ వారు నిజంగా శాడిస్టులాకాదా? కేవలం డబ్బు, పరపతిని ఉపయోగించుకోవడం కోసమే చేశారనేందుకు ఆ పాత్రలు కల్పించారా. అన్నది కూడా ప్రశ్నే. మొత్తానికి తాము చెప్పిందే కథ. మీడియాకు,పోలీసులకు, ప్రజలకు అనుమానాలుంటే  మళ్ళీ పెళ్లి సినిమా చూసుకోండని అర్థం వచ్చేలా వుంది. ఇది వారి పెండ్లి వీడియోగా పనికివస్తుంది. ఓటీటీలో ఫార్మెట్‌ సినిమా. అది అందరూ చూడ్డానికి కుదరదుకనుక సినిమా అయితే కామన్‌మేన్‌ కూడా చూస్తాడని తీసినట్లుంది.
 
నటనపరంగా నరేష్‌ బాగానే నటించాడు. పవిత్రకూడా అంతే. సంభాషణలపరంగా కాస్త ఫ్రీడమ్‌ తీసుకున్నారు. లెజెండ్‌ యాక్టర్‌ నరేస్‌ అని సంబోధిస్తారు. మిగిలిన పాత్రలు బాగా పండాయి. అందులో వనితా విజయకుమర్‌, సాగర్‌ పాత్రలు హైలైట్‌.  సంగీతపరంగా సురేష్‌ బొబ్బిలి బీజియమ్స్‌ బాగున్నాయి. దర్శకుడిగా ఎం.ఎస్‌.రాజు తన ముద్ర కనిపించాడు. చాప్టర్‌ 1,2,3,4 భాగాలుగా ముక్కముక్కలుగా సినిమా చూపించాడు. నరేష్‌, పవిత్ర ప్రేమ గురించి తెలియజేప్పె ప్రయత్నం కనుక సినిమా తీయకుముందు వున్న ఎట్రాక్షన్‌ సినిమా చూసేందుకు ప్రజలకు వుంటుందోలేదో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.