శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:23 IST)

విశ్వంత్ నటించిన సస్పెన్స్ చిత్రం హైడ్ న్ సిక్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

Hyde N Sick
Hyde N Sick
నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్: చిన్న రామ్, సంగీత దర్శకుడు: లిజో కె జోష్, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకత్వం: బసిరెడ్డి రానా
 
కేరింత, మనవంతా ఫేమ్  విశ్వంత్ నటించిన సినిమా హైడ్ న్ సిక్. శిల్పా మంజునాథ్ కీలక పాత్ర పోషించింది. బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ చూడగానే సస్పెన్స్ థ్రిల్లర్ అనిపించింది. ప్రచారాల చిత్రాలు చిత్రంపై ఆసక్తిని కలిగించాయి. ఈరోజే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం  ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
కర్నూల్ నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ హత్యలు జరుగుతుంటాయి. ఎవరికీ అర్థంకావు. అక్కడ మెడికో శివ(విశ్వంత్) తన అక్కతో వుంటాడు. చదువుతుండగానే కాలేజీ  తోటి ఫ్రెండ్ తో వర్ష(రియా సచ్దేవ్)  శివ ప్రేమించడం పెద్దలు అంగీకరిం జరిగిపోతాయి. అదే టైంలో  సిటీలోని మర్డర్లను పరిశోధించేందుకు వైష్ణవి (శిల్పా మంజునాథ్) రంగలోకి దిగుతుంది. అయితే ఈ మర్డర్లను పరిశోధించే టీమ్ కూ అందని పాయింట్లను శివ కొన్ని క్లూస్ లెటర్ ద్వారా పంపిస్తాడు. ఆ తర్వాత  ఓ సందర్భంలో పోలీసులు శివను టార్గెట్ చేస్తారు. ఆ సందర్భం ఏమిటి? ఎందుకు శివ ఇలా లెటర్ రాశాడు. శివ పెండ్లి ఏమయింది? వైష్ణవి ఎలా కేస్ ను డీల్ చేసింది? అనేదే  మిగిలన హైడ్ న్ సిక్ సినిమా.
 
సమీక్ష:
ఇలాంటి సస్పెన్స్ సినిమాకు ట్విస్ట్ లు కీలకం. దాన్ని దర్శకుడు బాగానే డీల్ చేశాడు. కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. కన్నడ నటి శిల్ప డైలాగ్ డెలివరీ లింక్ సింక్ బాగా మేనేజ్ చేసింది. అయితే కథ  బ్లూవేల్ గేమ్ తరహాలో అంశాన్ని తీసుకుని చేసినట్లుంది. ఇలాంటి పిల్లలు, పెద్దలు ఎలా ఆడతారో కసరత్తు చేశాడు. దానిని మరింత ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. కర్నూలు నేపథ్యం కథకు చిన్నదయినట్లుగా వుంది.  ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్దతిలో చేస్తున్నారు. అనేది పూరాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది. అయినా కొన్ని సినిమాల స్పూర్తిగా సన్నివేశాలు అనిపిస్తాయి.
 
విశ్వంత్ పాత్రకు న్యాయం చేశాడు.  కథకుడిగా పర్వాలేదు అనిపించుకున్నా.. దర్శకుడిగా మాత్రం మరింత కసరత్తు చేయాల్సింది.  ప్రీ క్లైమాక్స్ తరువాత కథ వేగం పెరగుతుంది. అయితే ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాల్లా కాకుండా జగ్రత్త పడ్డాడు. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో కూడా చాలానే జరిగాయి కాబట్టి కొందరు కనెక్ట్ అవుతారు. మంచి థ్రిల్ ను ఫీల్ అవుతారు. 
 
విశ్వంత్  పాత్రలో బాధ్యతగల తమ్ముడిగా, స్టూడెంట్ గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే చేశాడు. నటిగా శిల్పా మంజునాథ్ సరిపోయింది. తన లుక్స్ చాలా బాగున్నాయి. తన ఫేస్ లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్  పండించింది.  
 
ఇక దర్శకుడు బసిరెడ్డి రానా రాసుకున్న కథతో మొదటి సినిమా పరిధిలో బాగా డీల్ చేసినా ఇంకాస్ల కసరత్తు చేస్తే పెద్ద సినిమా అయ్యేది. ముఖ్యంగా సస్పెన్స్ సీన్లను చాలా బాగా హ్యండిల్ చేశారు.  కథాగమనం సస్పెన్స్ థ్రిల్లర్ కు ప్రాణం పోసింది. ఇలాంటి సినిమాలకు సంగీతం ప్రాణం. దాన్ని జో కె జోష్ బాగా ఆర్.ఆర్. చేశాడు. సినిమాటో గ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగాచేశారు. ఎడిటింగ్ కు పనిచెప్పాల్సింది. కథ, కథనం, బీజీఎమ్,  ఫస్ట్ ఆఫ్ బాగున్నా అక్కడక్కడ కాస్త ల్యాగ్ లతో చిత్రం కనిపిస్తుంది. అయినా సస్పెన్స్ చిత్రాల ప్రేక్షలు ఆదరిస్తే సినిమా మరింత రేంజ్ లో వుంటుంది.
రేటింగ్: 2.75/5