బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి
Rag Mayur, Rachcharavi, Mahesh Chintala, Kavita, Deeksha
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ 'బద్మాషులు'. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై B. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేసింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా అలరించాయి. రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా వున్నాయి. డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా వుంది. టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
టీజర్ లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. చీఫ్ గెస్ట్ గా కాదు ఒక మంచి ఫ్రెండ్ గా వచ్చాను. మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. తనది వండర్ ఫుల్ జర్నీ. విద్యసాగర్ మంచి నటుడు. రూటెడ్ డ్రామాలకి మంచి డిమాండ్ వుంది. ఆడియన్స్ చాలా రిలేట్ చేసుకుంటున్నారు. సినిమా బండి, సివరపల్లిలోని వైబ్ 'బద్మాషులు' టీజర్ లో కనిపించింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా ఆర్గానిక్ అండ్ ఫన్నీ గా వుంది. ప్యూర్ కామెడీ వుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.
యాక్టర్ రచ్చరవి మాట్లాడుతూ.. ఇది మన ఊరి కథ. ఇందులో పాత్రలు చాలా సహజంగా వున్నాయి. డైరెక్టర్ ఊర్లో వున్న రియల్ క్యారెక్టర్స్ తో సినిమా చేసినట్లుగా అనిపించింది. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయడనికి ముందుకు వస్తాను. 'బద్మాషులు'లకు అందరి తరపున సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ శంకర్ చేగూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాగ్ మయూర్, రచ్చ రవి అన్నకి థాంక్ యూ సో మచ్. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. టీజర్ జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ. చాలా ఆర్గానిక్ కామెడీ ఉటుంది. చాలా క్లీన్ ఎంటర్ టైనర్. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ చింతల, విద్యాసాగర్ ఈ కథకు యాప్ట్ గా చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను'అన్నారు.