1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (17:34 IST)

మణి సాయితేజను హీరోగా నిలబెట్టే చిత్రం ఆర్.కె. గాంధి రుద్రాక్షపురం : చిత్ర యూనిట్

Mani Saiteja,  R.K. Gandhi,  lion sai venket,  Prasanna Kumar and others
Mani Saiteja, R.K. Gandhi, lion sai venket, Prasanna Kumar and others
ఆర్.కె.గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం "రుద్రాక్షపురం". "మెకానిక్" ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నాగ మహేష్ కీలక పాత్ర పోషించగా... ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. 
 
తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నటి - ఎన్నారై ప్రశాంతి హారతి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, మెకానిక్ దర్శకుడు ముని సహేకర్, ప్రముఖ దర్శకుడు శ్రీరాజ్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరై  "రుద్రాక్షపురం" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. "రుద్రాక్షపురం" చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషించారు.
 
రేఖా, రాజేశ్, అజయ్ రాహుల్, పవన్ వర్మ , శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో  నటించిన ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం ఆర్ కె గాంధీ, సంగీతం: ఎం.ఎల్. రాజా - ఘంటాడి కృష్ణ - జయసూర్య బొంపెం, స్టంట్స్: థ్రిల్లర్ మంజు- బాజి- స్టార్ మల్లి, కెమెరా: నాగేంద్ర కుమార్ ఎం, ఎడిటర్: డి.మల్లి, నృత్యం: కపిల్ అన్నారాజ్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ.