ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (16:42 IST)

'జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా.. మనతోనే ఉంటాయి'.. తొలిప్రేమ ట్రైలర్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా తాజా చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా తాజా చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో వరుణ్ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
 
తాజాగా రిలీజ్ చేసిన ఈ చిత్రం ట్రైలర్‌లో 'జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా.. మనతోనే ఉంటాయి.. మోయక తప్పదు..' అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో రాశి తన ఇంతకు ముందు సినిమాల్లో కన్నా చాలా అందంగా కనిపించింది. లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా కనిపిస్తోంది. వరుణ్ ఇలాంటి సినిమాలో నటించడం ఇదే తొలిసారి. పైగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమకు ఈ చిత్రం పోటీ ఇస్తుందని హీరోయిన్ రాశి చెప్పుకొచ్చింది కూడా.