గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By ttdj
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2016 (15:49 IST)

కన్నుల పండువగా శ్రీవారి గరుడసేవ...(Video)

శ్రీవారి బ్రహోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడవాహన సేవ ఐదొవ రోజు రాత్రి వైభవోపేతంగా జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. తొమ్మది

శ్రీవారి బ్రహోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడవాహన సేవ ఐదొవ రోజు రాత్రి వైభవోపేతంగా జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. తొమ్మది రోజుల ఉత్సవాలలో ఐదొవరోజు అనగా పంచవేదాలు, గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్యం తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. స్వామి బ్రహ్మొత్సవాలకు ముక్కొటి దేవతులకు ఆహ్వానం పలికేదే గరుడుడు.
 
గరుడ వాహనం పై విహరించే ఉత్సవమూర్తికి ద్రువభేరమైన వేంకటేశ్వర స్వామికి భేదంలేదని చెప్పడానికే, నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొన్నారు. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే వేంకటేశ్వరుడిని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం. శ్రీవిల్లి పూత్తురు నుండి తీసుకువచ్చిన గోదాదేవికి అలంకరించిన పూలమాలను గరుడవాహనంపై విహరిస్తున్న స్వామి వారికి అలంకరించారు. 
 
స్త్రీ పురుషలలో ఎవరు ఎక్కువన్న లింగ భేధాలను తన భక్తులు విడనాడాలన్నదే ఇందులోని అంతరార్థం. అలాగే తమిళనాడు నుండి తీసుకొచ్చిన నూతన ఛత్రలను కూడా స్వామివారి వాహనసేవలో వినియోగించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందజేసే పట్టు వస్త్రాలను ఇవాల స్వామి వారికి అలంకరించారు. సర్వకాల సర్వావస్థాలందు తనను శరణు కొరిన భక్తులను రక్షించేందుకు శంఖ చక్రధారై గరుడుని అదిరోహించి సిద్ధంగా ఉంటానని నా పాదాలను ఆశ్రయించండి చెప్పడమే గరుడసేవలోని పరమార్ధం. వీడియో వీక్షించండి.