శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 మే 2024 (13:27 IST)

సోషల్ మీడియాలో 2024 వైఎస్‌ఆర్‌సిపి మంత్రుల లిస్ట్ వైరల్, మిస్ అయిన వంగా గీత, రోజాల పేర్లు

roja
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి. కొన్నిచోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల అదుపు రీత్యా ఈ చర్య తీసుకున్నారు. ఇదిలావుంటే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామంటే తమదే విజయమని అటు ఎన్డీయే ఇటు వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారు. వైసిపికి చెందిన కొంతమంది అభిమానులైతే ఏకంగా జూన్ 4 తర్వాత మంత్రి పదవులను చేపట్టేవారి జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వున్నారు.
 
వైరల్ అవుతున్న ఓ లిస్టులో డిప్యూటీ సీఎం చేస్తానంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వంగా గీత పేరు లేదు. అలాగే పర్యాటక శాఖామంత్రి రోజా పేరు కూడా మిస్ అయ్యింది. ఈ పేర్లు ఏమయ్యాయి అంటూనే లిస్టులో వున్నవారిలో ఐదుగురికి మించి గెలవరంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.